‘మహేష్ బాబు’ను సపోర్ట్ చేయమని ఎప్పుడు అడగలేదు.. ఎందుకంటే : ‘సుధీర్ బాబు’!!

‘ఏ మాయా చేసావ్’ చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన తరువాత సుధీర్ బాబు 2012 లో ‘ఎస్ఎంఎస్’ చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత హర్రర్-కామెడీ ప్రేమ కథా చిత్రంతో తనకంటూ ఒక బాక్సాఫీస్ హిట్ ని అందుకున్నారు. ఇక 2018లో ఈ 40 ఏళ్ల నటుడు ‘సమ్మోహనం’ మరియు ‘నాన్న దోచుకుండువేట్’ వంటి సీన్8మాలతో బ్యాక్-టు-బ్యాక్ సక్సెస్ లను అందుకున్నారు.

ఇటీవల సుధీర్ బాబు ‘వి’ సినిమాతో కూడా ఆడియెన్స్ ని సరికొత్తగా ఆకట్టుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో సుధీర్ బాబు తన బావ మహేష్ సపోర్ట్ అడగకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. “ఈ రోజు వరకు, నేను మహేష్ దగ్గరకు వెళ్ళలేదు, ఎవరితోనైనా అవకాశం ఇప్పించమని గాని సినిమాను నిర్మించమని గాని అడిగింది లేదు. నేను ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాను కాబట్టి నాకు ఒక చిన్న అనుభవం ఉంది. ఏదైనా సరే మన సొంతంగా సంపాదించుకోవలని అనుకున్నాను. నేను మహేష్‌ను లేదా మా నాన్నగారిని అలాగే కృష్ణ గారిని కూడా ఎన్నడు సహాయం అడగలేదు. అలా అడగవద్దని సినిమాల్లోకి రాకముందే నేను డిసైడ్ అయ్యాను. అలా అవకాశాలు అందుకుంటూ ఉంటే మన విజయానికి కూడా విలువ ఉండదు. అది ఒక కట్నంతో సమానమని కూడా చెప్పవచ్చు.. అని సుధీర్ బాబు వివరణ ఇచ్చాడు.