Bollywood: బాలీవుడ్ లేడీ క్వీన్ కంగనా రనౌత్ సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో మరోసారి రెచ్చిపోయింది.. ఈ సారి సుశాంత్‌ను హత్యా చేసింది వాళ్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే గతంలో వివాదాస్పద విషయాలను షేర్ చేస్తుండడంతో ఆమె ట్విట్టర్ ఖాతాపై ఆంక్షలు విధించారు. దీంతో ట్విట్టర్ సీఈవోపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య తగ్గడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. నాకొక పనికిమాలిన లవర్ ఉండేవాడు.. వాడే ఇదంతా చేస్తున్నాడు. వాడు ఏ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాడో తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు అంటూ తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేసింది కంగనా.
అలాగే త్వరలోనే Bollywoodనా టీమ్ వాడి గురించి మొత్తం విషయాలను బయటకు తీసుకు వస్తారు అంటూ హెచ్చరించింది. నా ఫాలోవర్స్ సంఖ్య తగ్గించడానికి వాడు ఎంత ఖర్చు చేశాడో కూడా నాకు తెలుసు అంటూ ఆరోపణలు చేసింది. అలాగే సుశాంత్‌ను హత్యా చేసింది కూడా ఆ హంతకుడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా.. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆ పనికి మాలిన లవర్ ఎవడు అంటూ నెటిజన్స్.. Bollywoodకంగనాను ప్రశ్నిస్తున్నారు.