రజనీకాంత్ ప్రకటనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రజనీ.. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం లేదంటూ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితుల దృష్టా వెనక్కి తగ్గుతున్నట్లు రజనీ ప్రకటించినా.. దీని వెనుక మరో కారణం ఉందనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. కొంతమంది వ్యక్తుల ఒత్తిడితోనే రజనీ ఈ ప్రకటన చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

kamal haasan

రజనీ చేసిన ప్రకటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో రజనీ ప్రకటనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ ప్రకటన ఆయన అభిమానుల్లాగే తనను ఎంతో నిరాశకు గురిచేసిందని కమల్ తెలిపారు. ఆయన ఆరోగ్యం కూడా తనకెంతో ముఖ్యమన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రజనీని కలుస్తానని కమల్ చెప్పారు.

ఇక కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ మాత్రం రజనీ మంచి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించాడు. ఆయన ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నాడు. ఇక రజనీ ప్రకటనపై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మ స్పందించారు. రజనీకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని తాను ప్రశంసిస్తున్నానని, ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.