స్టార్ హీరోల పోరులో ఎంత మంచి వాడవురా

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఎంత మంచివాడవురా. సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.

kalyan ram

సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ ఉన్నా ఎంత మంచి వాడవురా సినిమాకి ఆంధ్ర ఏరియా నుంచి 8 కోట్ల డీల్ సెట్ అయ్యింది. పండగ సీజన్ కావడం, 2017కి సతీష్ వేగేశ్న శతమానం భవతి లాంటి కంప్లీట్ ఫ్యామిలి ఎంటర్టైనర్ ఇవ్వడం, కళ్యాణ్ రామ్ కూడా గత కొంతకాలంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం… ఎంత మంచి వాడవురా సినిమాకి హెల్ప్ అయ్యింది. మరి స్టార్ హీరోల పోరు జరుగుతున్న సమయంలో రిలీజ్ కానున్న ఎంత మంచి వాడవురా సినిమా అసలైన సంక్రాంతి పండగ చిత్రంగా నిలుస్తుందేమో చూడాలి.