ఈసారి మాత్రం డిజప్పాయింట్ చేయలేదు

కాజల్ అగర్వాల్… ఏడాదిన్నర కాలంలో నాలుగు సినిమాలు చేసినా హిట్ అనే పదానికి చాలా దూరంగా ఉన్న హీరోయిన్. ప్రతి సినిమాతో తన లక్ ని టెస్ట్ చేసుకుంటున్న కాజల్, తమిళ్ లో కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ఇండిపెండెన్స్ డేకి తెలుగులో రణరంగం, తమిళంలో కోమలి సినిమాలు చేసిన కాజల్, ఎట్టకేలకు కోలీవుడ్ లో హిట్ కొట్టింది. జయం రవి హీరోగా నటించిన కోమలి సినిమా విడుదలకి ముందే చాలా విమర్శలు ఫేస్ చేసినా కూడా థియేటర్స్ లో మూవీని చుసిన వాళ్లు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెగటివ్ రివ్యూస్ ని లెక్క చేయకుండా మంచి వసూళ్లు రాబడుతున్న కోమలి సినిమా కేవలం చెన్నైలోనే ఐదున్నర కోట్ల గ్రాస్ ని రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది. దీంతో ఏడాదిన్నరగా కాజల్ కోరుకుంటున్న హిట్ దక్కింది. కోలీవుడ్ లో హిట్ కొట్టిన కాజల్ చేతిలో ప్రస్తుతం తెలుగు అవకాశాలు పెద్దగా లేవు, మరి ఈ అమ్మడుకి సినిమా ఛాన్స్ తో పాటు హిట్ ఇచ్చే ఆ హీరో ఎవరో చూడాలి.