గబ్బర్ సింగ్ రూట్ ఫాలో అవుతున్నాడా?

హరీశ్ శంకర్ అనగానే గబ్బర్ సింగ్ సినిమా టక్కున గుర్తొస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి ఈ డైరెక్టర్ సూపర్ హిట్ కొట్టాడు. గబ్బర్ సింగ్ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మూవీకి రీమేకే అయినా ఎక్కడా ఆ ఛాయలు కనిపించకుండా, ప్రతిదీ కొత్తగా రాసిన హరీశ్ శంకర్ ఇప్పుడు వాల్మీకి సినిమాకి కూడా అదే రూట్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి, తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండకి రిమేక్ గా రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిన జిగర్తాండకి హరీశ్ శంకర్ మార్పులు చేర్పులు చేసి మన నేటివిటీకి తగ్గట్లు మార్చినట్లు ఉన్నాడు.

తెలుగులో వరుణ్ తేజ్ చేసిన పాత్రని తమిళ్ లో బాబీ సింహా చేశాడు, సినిమాకి బ్యాక్ బోన్ లాంటి ఈ పాత్రకి కోలీవుడ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉండదు కానీ హరీశ్ శంకర్ మాత్రం వాల్మీకి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పెట్టినట్లు ఉన్నాడు. రీసెంట్ గా వినాయక చవితి రోజు రిలీజ్ అయిన వాల్మీకి పోస్టర్ చూస్తే అది నిజమనిపించకమానదు. ఇప్పటి వరకూ ప్రతి పోస్టర్ లో గుబురు గడ్డంతో కనిపించిన వరుణ్, వినాయచవితి నాడు విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం యంగ్ లుక్ లో కనిపించాడు. పైగా తమిళ్ లో బాబీ సింహా పాత్రకి లవ్ స్టోరీ లేదు, అది కూడా మర్చి హరీశ్ శంకర్… వరుణ్ తేజ్ కి లవ్ స్టోరీ పెట్టాడు. వరుణ్, పూజా హెగ్డే కలిసి ఉన్న పోస్టర్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఇక రీసెంట్ గా వాల్మీకి సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన హరీశ్, లాస్ట్ రోజు షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటోని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో హరీశ్ శంకర్ తో పాటు హాస్య బ్రహ్మా బ్రహ్మానందం కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వాల్మికీలో కామెడీ డోస్ కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా వాల్మీకీ సినిమాలో చిన్న క్యామియో చేస్తుండడం విశేషం. మొత్తానికి జిగర్తాండ సినిమాలోని ఆత్మని మాత్రమే తీసుకోని హరీశ్ శంకర్ కొత్త వాల్మీకీని తీసినట్లు ఉన్నాడు. మరి బాబాయ్ హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ రూట్ నే అబ్బాయికి కూడా ఫాలో అవుతున్న హరీశ్ శంకర్ ప్రేక్షకులని ఎంత వరకూ మెప్పిస్తాడో తెలియాలి అంటే సెప్టెంబర్ 30 వరకూ ఆగాలి. అప్పటి వరకూ వాల్మీకీ నుంచి రేపు రిలీజ్ కానున్న గగన వీధిలో సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి.