స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సంప్రదాయ పంజాబీ, కాశ్మీరీ స్టైల్స్‌లో ముంబైలోని ఒక స్టార్ హోటల్లో గత రాత్రి మూడు మూళ్ళ బంధంతో వీరు మరింత దగ్గరయ్యారు. తన వివాహం తర్వాత నటనను కొనసాగిస్తానని కాజల్ ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చింది. ఇక వివాహ వేడుకలు ముగిసిన అనంతరం కాజల్ రెండు వారాలు మాత్రమే విరామం తీసుకుందట.
వెంటనే హనీమూన్ ప్లాన్ ఏమి సెట్ చేసుకోలేదట. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య యొక్క తదుపరి షెడ్యూల్ కోసం కాజల్ మళ్ళీ హైదరాబాద్ రానుంది. ఈ సినిమా షూటింగ్ వలన కాజల్ తన హనీమూన్ ప్రణాళికలను వాయిదా వేసుకుందని సమాచారం. తాజా నివేదికల ప్రకారం, కాజల్ నవంబర్ రెండవ వారం నుండి ఆచార్య షూట్లో చేరనున్నారు. ఆచార్యలో తన సీన్స్ కి సంబంధించిన షూటింగ్ పనులు ముగించుకున్న తరువాత కాజల్ డిసెంబరులో హనీమూన్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.