తాతగా తారక రాముడు… ఈసారి ఫిక్స్ అవ్వండి…

మహానటి, సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన సినిమా. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అద్భుతంగా నటించి మెప్పించింది. సావిత్రమ్మనే మళ్లీ పుట్టిందా అనే స్థాయిలో మెప్పించిన కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇంత గొప్పగా రావడానికి ఇండస్ట్రీలోని చాలా మంది హెల్ప్ అయ్యారు. ముఖ్యంగా సావిత్రి సినీ జీవితంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని తెరపై చూపించారు. అక్కినేని నాగేశ్వర రావు ప్లేస్ లో చైతన్య నటించాడు. సీనియర్ ఎన్టీఆర్ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ని మేకర్స్ అప్ప్రోచ్ అయ్యారు కానీ అది సెట్ అవలేదు.

jr ntr as ntr

తాత పాత్రలో తనని తాను ఎప్పటికీ ఊహించుకోలేను అన్నాడు. దీంతో మహానటి నుంచి ఎన్టీఆర్ పాత్రని పూర్తిగా తగ్గించేశారు. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు కానీ అది జరగలేదు. ఇప్పుడు మరోసారి తాత పాత్రలో తారక్ నటిస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత జీవితం ఆధారంగా కంగనా రనౌత్ హీరోయిన్ గా తలైవి సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన తలైవి సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడని సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. మరి ఇది ఎంత వరకూ నిజం? ఒకప్పుడు తాతగా కనిపించను అని తేల్చి చెప్పిన ఎన్టీఆర్, తలైవి కోసం ఆ పాత్రలో కనిపిస్తాడా అనేది చూడాలి.