ఒక హీరో అలా కావాలని అడిగాడు, ఒప్పుకోలేదు…

రకుల్ ప్రీత్ సింగ్, అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్. టాలీవుడ్ ఉన్న టాప్ హీరోలందరితో కలిసి నటించిన ఈ బ్యూటీకి గత కొన్ని రోజులుగా సరైన సినిమా పడలేదు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నా కూడా రకుల్ కి కంబ్యాక్ ఇచ్చే హిట్ మాత్రం పడలేదు. అవకాశాల కోసం టాలీవుడ్, బాలీవుడ్ చుట్టూ తిరుగుతున్న ఈ హీరోయిన్ రీసెంట్ గా ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎన్నో విషయాలని షేర్ చేసుకున్న రకుల్, తాను ఒకరిని నమ్మి మోస పోయానని చెప్పుకొచ్చింది.

ఒకరిని లవ్ చేశానని చెప్పిన రకుల్, అతనికి టేస్ట్ లేదని చెప్పి వచ్చేశానని చెప్పింది. గీత గోవిందం సినిమా గురించి మాట్లాడిన రకుల్, అజయ్ దేవగన్ సినిమా కోసం విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ వదులుకున్నాను. ఆ మూవీ హిట్ అయిన తర్వాత ఒక చిన్న క్యారెక్టర్ చేసినా బాగుండేది కదా అనుకున్నానని చెప్పింది. రకుల్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి వచ్చిన రష్మీక, గీత గోవిందం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

ఇక ఒక హీరో గురించి కూడా మాట్లాడిన రకుల్, తనతో పాటు నటించిన ఒక హీరో కమిట్మెంట్ అడిగాడని… అయితే అది మీటు లాంటిది కాదు ఫ్రెండ్లీగానే అడిగాడని చెప్పింది. తన ఇంట్రెస్ట్ లేకపోవడంతో నో చెప్పానన్న రకుల్, ఆ హీరో ఎవరు అనే విషయం మాత్రం బయట పెట్టలేదు.