జోకర్ హీరోకి 367 కోట్ల భారీ ఆఫర్

2019లో ప్రేక్షకుల ముందుకి వచ్చి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా జోకర్. జాక్విన్ ఫీనిక్స్ నటించిన ఈ మూవీ 737మిలియన్ డాలర్లని వసూళ్లు చేసింది. రిలీజ్ సమయంలో కాస్త నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేసిన జోకర్, ఆస్కార్ లని సొంతం చేసుకుంది. ఫీనిక్స్ అద్భుత నటనకి ఫిదా అవ్వని సినీ అభిమాని ఉండడు. జోకర్ ఇండియాలో కూడా మల్టిప్లెక్స్ థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించింది.

అనుకున్న దాని కన్నా పెద్ద హిట్ అవ్వడంతో మేకర్స్ ఈ మూవీకి వచ్చే నాలుగేళ్లలో రెండు సీక్వెల్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జోకర్ సీక్వెల్ లో నటించడానికి ఫీనిక్స్ సుముఖంగా లేకపోవడంతో, అతనికి దాదాపు 367కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఒప్పించారని సమాచారం. 2022-2024లో రాబోతున్న రెండు చిత్రాలకి కలిపి ఇంతమొత్తంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల పాటు ఒకటే ప్రాజెక్ట్ తో కలిసి ట్రావెల్ చేయడం అనేది ఫీనిక్స్ కి కష్టమైన పనే అయినా డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాలని కంప్లీట్ చేయగలమనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.