బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫాంటసీని బయట పెట్టింది. తాను ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో స్థిరపడాలని, అక్కడ ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాట్లు తెలిపారు. తన భర్తతో కలిసి అరిటాకులో భోజనం చేస్తూ గోవింద నామధేయం చేసుకోవాలని, అలా తింటూ మంచి మణిరత్నం సంగీతాన్ని వింటూ గడపాలని తెలిపారు. అంతేకాక తన భర్త పంచ కట్టుకుని ఉండగా తలకు ఎంతో రొమాంటిక్గా మసాజ్ చేయడం తనకి ఇష్టం అన్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో ఇంటర్నెట్లో వరల్డ్ గా మారింది. జాన్వి తన ఫాంటసీని బయట పెట్టడంతో ఇంటర్నెట్లో అందరూ వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.