నాలుగు భాషల్లో కంగనా తలైవి…

ఎన్టీఆర్ బయోపిక్, కపిల్ దేవ్ బయోపిక్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని టేకప్ చేసిన విష్ణు ఇందూరి లేటెస్ట్ సినిమా ‘తలైవి’. నేడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న విష్ణు ఇందూరి, ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి తలైవి విశేషాలని తెలిపారు. సినీ నటి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేయనుంది. జయలలిత పర్సనల్ జీవితం ఎలా గడిచింది? ఆమె సినీ ప్రయాణం ఎలా సాగింది? లాంటి విశేషాలతో సాగనున్న తలైవి, క్లైమాక్స్ లో జయలలిత సీఎంగా ప్రమాణ శ్వీకారం చేయడంతో ముగుస్తుందట.

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోని అక్టోబర్ 15న సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న తలైవి సినిమాని తెలుగు, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ బయోపిక్ తో సౌత్ లో పాగా వేయాలని బాలీవుడ్ క్వీన్ భావిస్తోంది.