ఆ యంగ్ హీరోతో శ్రీదేవి కూతురు లవ్ ఎఫైర్

శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ అందిరకీ సుపరిచితమే. శ్రీదేవి వారసత్వంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు… హిందీలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిగతా భాషల్లో కూడా నటించేందుకు జాన్వి కపూర్ ఆసక్తి చూపుతోంది. కానీ మంచి కథలు దొరకడం లేదు. మంచి పాత్రలలో నటించే అవకాశం దక్కితే మిగతా భాషల్లో కూడా నటిస్తానని ఈ ముద్దగుమ్మ ఎప్పుడో ఓపెన్‌గా చెప్పేసింది.

janvy kapoor

అయితే సినిమాలతో పాటు లవ్ ఎఫైర్స్‌తో ఈ భామ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో జాన్వి కపూర్ గత కొంతకాలంగా లవ్ ఎఫైర్ నడుపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే టాక్ బాలీవుడ్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం దోస్తానా 2 సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ఆ సినిమా సందర్భంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని బాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

దోస్తానా 2 సినిమాను కోలియన్ తెరకెక్కిస్తుడగా.. కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. 2008లో విడుదలైన దోస్తానా సినిమాకు సీక్వెల్‌గా దోస్తానా 2 తీస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్,కార్తీక్ ఆర్యన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని సినిమా యూనిట్ చెబుతోంది.