శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ లో నల్లపనేని యామిని సమర్పణలో బాలకృష్ణ నిర్మాణం చేస్తూ ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందించడం జరిగింది. అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటిస్తున్న చిత్రంలో దేవదత్త గజనం నాగే కీలకపాత్రలో కనిపించనున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేసిన చిత్రానికి ప్రసాద్ మూరేళ్ల, రసూల్ ఏలూర గా పనిచేయగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించడం జరిగింది. ఈనెల 22వ తేదీన చిత్రం విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ లోని ఎఎంబి థియేటర్లో టైలర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా, సందీప్ కిషన్, ప్రశాంత వర్మ, గల్లా జయదేవ్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది.
ఈ సందర్భంగా రైటర్ సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ… “నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఒక విధంగా దగ్గుబాటి రాణా. నాకు రచయితగా మొదటిగా అవకాశం వచ్చింది కృష్ణం వందే జగద్గురుమ్. అలాగే దేవకి నందన వాసుదేవ చిత్రం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన ప్రతిది ఉండటం విశేషం. చిత్రం చాల బాగా వచ్చింది. దర్శక నిర్మాతలు ఎంతో ఇష్టంగా తీశారు. ఈ చిత్రంతో పని చేసిన ప్రతి ఒక్కరూ తరువాత స్థాయికి వెళ్లేలా ఈ చిత్రం రూపొందించబడింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు అర్జున్ జంద్యాల మాట్లాడుతూ… ” ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… “కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, గల్లా జయదేవ్ గారికి, మీడియా మిత్రులకు, అభిమానులకు ధన్యవాదాలు. ఈ చిత్ర కథ ఎవరు చేస్తే బావుంటుంది అనుకున్నాము. అశోక్ ఈ కథ చేయడం నాకు ఎంతో సంతోషం. ఇటీవలే నేను ఈ చిత్రం చూడటం జరిగింది. ఆర్ఆర్ నాకు ఎంతో బాగా నచ్చింది. చిత్రం కూడా చాల బాగ వచ్చింది. ఈ చిత్రం దర్శకత్వం చేసిన అర్జున్ గారు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత బాలకృష్ణ మాట్లాడుతూ… “నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటే ముఖ్య కారణం ప్రశాంత్ వర్మ గారు. ఆయనకి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో బిజిఏం అఖండ స్థాయిలో ఉండబోతుంది. దేవ దత్ గారు ఈ చిత్రంలో చాల బాగా చేయడం జరిగింది” అన్నారు.
హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అతిథులు అందరిని చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అర్జున్ గారు నాకు మంచి గురువుల నిలిచారు. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను వారి అందరితో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉంది. వారి దగ్గర నుండి చాల నేర్చుకున్నాను” అన్నారు.
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన రాణా గారికి, సందీప్ కిషన్ గారికి, ప్రశాంత్ వర్మ గారికి ధన్యవాదాలు. మేము ఈ రోజు ఇక్కడి వరుజు రావడానికి కారణం ప్రశాంత్ వర్మ. అదే విధంగా అర్జున్ గారి దర్శకత్వం, మాధవ్ గారి డైలాగ్స్ ఎంతో అద్భుతం. అలాగే బాల గారి థాంక్స్. ఈ కార్యక్రమానికి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన నాన్న గారికి ధన్యవాదాలు” అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రశాంత్ వర్మ ఈరోజు ఈ స్థాయికి రావడం చాల సంతోషం అనిపించింది. ట్రైలర్ చూస్తుంటే ఎంతో కష్టపడి జాగ్రత్తగా తీసినట్లు అర్థం అవుతుంది. రాణా గారు చాల మందికి ఎంతో సపోర్ట్ చేస్తారు. ఆయన కొత్త టాలెంట్ బాగ ఎంకరేజ్ చేస్తారు” అన్నారు.
దగ్గుబాటి రాణా మాట్లాడుతూ… “ముందుగా సాయి మాధవ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీకు నా ధన్యవాదాలు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు. ఈ చిత్రం విషయానికి వస్తే కృష్ణ తత్వం బాగ కనిపిస్తుంది. ఈ చిత్రం 22వ తేదిన రాబోతుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తను అని అనుకుంటున్నాను” అన్నారు.
గల్లా జయదేవ్ మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రశాంత్ వర్మ గారు, మీ కథలో అశోక్ నటించడం చాల ఆనందం. అశోక్ ను చూసి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. చిత్ర బృందానికి కృతజ్ఞతలు. ఈ చిత్రం గొప్ప విజయం అందుకోవాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.