వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ అనే చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాయి. ఆల్రెడీ చాలా చోట్ల ప్రీమియర్లు వేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రయూనిట్ గురు వారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బలగం వేణు, వశిష్టలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నా 21 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శకుల్ని పరిచయం చేశాను. దిల్ రాజు ప్రొడక్షన్స్ ద్వారా చిన్న చిత్రాలను, కొత్త టాలెంట్‌ను తీసుకు రావాలని అనుకున్నాం. అలా బలగం వచ్చింది. ఇప్పుడు సందీప్, ఆ తరువాత శశి వస్తున్నాడు. చిన్న చిత్రాన్ని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లడం చాలా కష్టం. ఓ సినిమాను నమ్మి, బాగా వచ్చిందని అనుకున్నా.. ఆడియెన్స్ వరకు తీసుకెళ్లడం కష్టం. అందుకే బలగంలా రిలీజ్‌కు ముందే చాలా మందికి చూపించాం. ఈ క్రమంలోనే మీడియాకి కూడా చూపించాం. మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే పాస్ అయ్యాం. కానీ ఆడియెన్స్‌ని థియేటర్లకు ఎలా రప్పించాలి అనేది పెద్ద టాస్క్. అసలే దసరా సందర్భంగా చాలా చిత్రాలు వస్తున్నాయి. వస్తున్న ఆరేడు చిత్రాల్లో ఇలాంటి మంచి చిత్రం వచ్చినప్పుడు.. మీడియానే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి చిన్న చిత్రాలు తీయాలనే ఆత్రుత, భయం రెండూ ఉంటాయి. చిన్న చిత్రాలతోనే ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుంది. మీడియానే జనాల వద్దకు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాలి. ఈ చిత్రం బాగా ఆడితేనే టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు మంచి పేరు, ఆఫర్లు వస్తాయి. ఆద్యంతం నవ్వించేలా ఉందని అందరూ చెబుతున్నారు. ఇలాంటి మంచి సినిమాను మీడియానే ముందుకు తీసుకెళ్లాలి. అక్టోబర్ 12న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ వేణు మాట్లాడుతూ.. ‘సందీప్ గారికి, సుహాస్, హర్షిత్ గారికి థాంక్స్. ఆల్రెడీ ఈ మూవీని చూశాను. ప్రసాద్ ల్యాబ్‌లోనే వంద శాతం రెస్పాన్స్ వచ్చిందంటే.. థియేటర్లో రెట్టింపు రెస్పాన్స్ వస్తుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా నచ్చింది. అందుకు అందరికీ ముందుగానే కంగ్రాట్స్ చెప్పాను. ఫ్యామిలీ అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేసేలా మంచి సందేశాత్మక చిత్రం కానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 12న ఈ చిత్రం వస్తోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. ‘ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా లేదు.. సక్సెస్ మీట్‌లా ఉంది. నేను ఆల్రెడీ మూవీని తీశాను. ఇంత సెన్సిటివ్ పాయింట్‌ను, ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా చేశారు. ఇలాంటి పాయింట్‌ను మాట్లాడేందుకు సిగ్గు పడతారు. కానీ అద్భుతంగా తీశారు. మనకు జరిగిందే స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా? అని అందరూ కనెక్ట్ అవుతారు. స్కూల్ ఫీజ్‌లు, హాస్పిటల్ ఖర్చులు ఇలా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన బొమ్మరిల్లు రేంజ్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. హీరోగా, డిస్ట్రిబ్యూటర్‌గా సుహాస్‌కు కంగ్రాట్స్. హర్షిత, హన్షిత్లు బలగం పార్టీనే నాకు ఇంకా ఇవ్వలేదు. ఈ మూవీది ఇంకా బ్యాలెన్స్ ఉంది’ అని అన్నారు.
సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడుతూ.. ‘మా మూవీని ఇది వరకు చాలా చోట్ల ప్రదర్శించాం. మీడియా కూడా మా సినిమాను చూసింది. అందరూ మంచి ప్రశంసలు కురిపించారు. నాకు ఇంత మంచి టీం ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. నాలుగేళ్ల క్రితం ఈ కథ ఓకే అయింది. సుహాస్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లింది. ఆయనే నా మొదటి హీరో. మలయాళీ అయినా సంగీర్తన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ మూవీలో చేసిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. నా టెక్నికల్ టీంకు థాంక్స్. డీఓపీ సాయి శ్రీరాం గారి వల్లే 47 రోజుల్లో పూర్తి చేశాం. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ కూడా బాగా ఇచ్చారు. ఎడిటర్ పీకేని ఆర్టిస్టుగానే ఎక్కువగా గుర్తు పడతారు. ఈ మూవీతో ఎడిటర్‌గా ఎక్కువ గుర్తు పట్టాలని కోరుకుంటున్నాను. క్యాస్టూమ్ డిజైనర్ భరత్ పర్సనల్ స్టోరీతోనే ఇంకో సినిమాను చేయొచ్చు. మిడిల్ క్లాస్‌ను బాగా చూపించాడు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సుహాస్ మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా కూడా మా చిత్రంపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సంగీర్తన మాట్లాడుతూ.. ‘మా మూవీ ఈవెంట్‌కు వచ్చిన వేణు గారు, వశిష్ట గారికి థాంక్స్. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమా చూసిన వారంతా కూడా ఎంతో సంతోషంగా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. వారి ప్రేమను కురిపిస్తున్నారు. అక్టోబర్ 12న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
ఎడిటర్ పీకే మాట్లాడుతూ.. ‘సుహాస్ అన్నతో నాకు ఇది ఆరో చిత్రం. చాయ్ బిస్కెట్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. మాది ఏడేళ్ల బంధం. ఆయన ఓ నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తాడు. అలాంటిది ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. దిల్ రాజు గారిలా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని ఉంది’ అని అన్నారు.
రోల్ రైడా మాట్లాడుతూ.. ‘జనక అయితే గనక అయితే యూత్, ఫ్యామిలీ ఇలా అందరినీ ఆకట్టుకుంటుంది. సుహాస్ తన విజయ పరంపరను ఈ చిత్రంతో కొనసాగిస్తాడు. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.