మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న రామ్‌, పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌`

,

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన లవ్‌ సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:

రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.