`ఇస్మార్ట్ శంక‌ర్` విడుద‌ల‌ తేదీ ఖరారు

Ismart Shankar Release Date

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. డబుల్ దిమాక్ హైద‌ర‌బాదీ ట్యాగ్ లైన్‌. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై ఔట్ స్టాండ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. టైటిల్ రోల్‌లో న‌టించిన రామ్ టెరిఫిక్ షో చేశాడ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ చిత్రాన్ని జూలై 12న విడుద‌ల‌ చేస్తున్నారు. మూడు పాట‌ల చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంది. ఈ పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించ‌బోతున్నారు. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.