బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ కొద్దికాలం మిషాల్ అనే వ్యక్తితో రిలేషన్ నడిపింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో వీరిద్దరు గత ఏడాది విడిపోయారు. అయితే ఇప్పుడు ఐరా ఖాన్ కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కుంది. తన ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ షీఖరేతో ఐరా ఖాన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు అమిర్ ఖాన్‌కు ఫిటెనెస్ ట్రైనర్‌గా నుపూర్ ఉన్నాడు. ఆ తర్వాత ఐరాకు సైతం ట్రైనర్‌గా మారాడు.
గత కొద్దిరోజులుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి వ్యక్తిత్వం నచ్చడంతో ఐదా అతనితో ప్రేమలో పడిందని సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ఐరా తన తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమిర్ ఖాన్ ఫామ్‌హౌస్‌తో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. త్వరలోనే వీరిద్దరి పెళ్లి చేసుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి గత బాయ్‌ఫ్రెండ్ లాగే చేస్తుందా.. లేదా కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటుందా? అనేది చూడాలి