మేము పంది మాంసం తింటామన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్

మెగా వపర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపసాన “యుఆర్ లైఫ్” అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. దీని కోసం ఇటీవల సమంత గెస్ట్ ఎడిటర్‌గా వచ్చి ఒక వంటకం చేయగా.. తాజాగా రష్మిక మందన్నా గెస్ట్‌ ఎడిటర్‌గా వచ్చింది. రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక అనే శీర్షికతో ఆమె తన వంటలను జనానికి పరిచయం చేస్తూ వీడియోలు చేస్తుంది. అందులో భాగంగా తాజాగా చికెన్ పుట్టు కర్రీని రష్మిక వండింది. దీనిని ఉపాసనకు రుచి చూపించగా.. చాలా బాగా చేశావని ఉపాసన ప్రశంసించింది.

rashikanna

ఈ సందర్భంగా రష్మిక కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తమది కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గామని చెప్పింది. తమ సామాజిక వర్గం వాళ్లు ఎక్కువగా పంది మాంసం తింటారని, పంది మాంసం తమ సాంప్రదాయ వంటకమంది. నిప్పు మీద కాల్చుకుని పంది మాంసం తింటామని రష్మిక చెప్పింది. అంతేకాదు తమ సామాజికవర్గం వారు ఇంట్లోనే వైన్ తయారు చేసుకుని తాగేందుకు ఇష్టపడతారని రష్మిక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

ప్రతి కొర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు పెగ్గుల వైన్ తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందని అంటారు. అందుకే తాము దీనిని ఎక్కువగా తీసుకుంటామని, దీని వల్ల మంచి ఆరోగ్యం కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది. కొర్గి ప్రజలు ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉంటారంది.