‘8 వసంతాలు’ పూర్తి కావస్తున్న షూటింగ్
హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు నిర్మించడంలో పాపులరైన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కంటెంట్ రిచ్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తోంది. వారి లేటెస్ట్ ప్రాజెక్ట్ '8 వసంతాలు', మను ఫేంఫణీంద్ర నర్సెట్టి...
‘నాయకుడు’ కోసం చాలా రోజుల తర్వాత జానపద గీతం చేశా – ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ
తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన 'మామన్నన్' తెలుగు ప్రేక్షకుల ముందుకు 'నాయకుడు'గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు....
‘బేబీ’ సినిమా కాన్సెప్ట్ మాస్‌కు కనెక్ట్ అవుతుంది.. ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు....
‘బ్రో’ అనేది మామూలు సినిమా కాదు.. కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు....
సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది.. ‘బేబీ’పై హీరోయిన్ వైష్ణవీ చైతన్య
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు....
అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది.. ‘భాగ్ సాలే’పై హీరో శ్రీసింహా
శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్...
‘రంగబలి’ అందరికీ నచ్చే మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ : హీరో నాగశౌర్య
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో...
నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రంలో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను…హీరోయిన్ సోను ఠాగూర్ ఇంటర్వ్యూ
లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో వస్తున్న "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రంలో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను...హీరోయిన్ సోను ఠాగూర్ ఇంటర్వ్యూ
ఈ నెల 9 న...
`ఫస్ట్ డే ఫస్ట్ షో` హిలేరియస్ ఎంటర్ టైనర్ : హీరో శ్రీకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ
ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్‌మెంట్ బేనర్ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫస్ట్ డే ఫస్ట్ షో`. 'జాతిరత్నాలు'తో బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయకుడు శ్రీకాంత్ రెడ్డి విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీ నేపధ్యం గురించి చెప్పండి,..అలాగే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
మాది హైదరాబాద్. అల్వాల్ లో వుంటాను. బిటెక్ పూర్తి చేశాను. బిటెక్ థర్డ్ ఇయర్ నుండే సినిమాల పై ఆసక్తి పెరిగింది. కొన్ని లఘు చిత్రాలు చేశాను. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఈ క్రమంలో పిట్టగోడ ఆడిషన్ లో మెయిన్ లీడ్ గా ఎంపికయ్యాను. అక్కడే అనుదీప్ పరిచయం. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా మంచి పాత్రల కోసం ఆడిషన్స్ ఇస్తూనే వున్నాను. కథ హీరో అని నమ్ముతాను. మంచి కథలో చిన్న పాత్ర చేసినా తృప్తి వుంటుంది. అలాంటిది చిరంజీవి గారు , కమల్ హసన్ గారు లాంటి గొప్పగొప్ప హీరోలతో గొప్ప క్లాసిక్ చిత్రాలు తీసిన పూర్ణోదయ బ్యానర్ లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. అంతకుముందే అనుదీప్ ఈ కథ గురించి ఒకసారి నాకు చెప్పారు. చాలా అద్భుతమైన కథ. ఆడిషన్స్ ఇచ్చాను. దర్శక నిర్మాతలకు నచ్చింది. తర్వాత ఫోటోషూట్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాతే ఫైనల్ చేశారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. నాలో ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది.
'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ నేపధ్యం గురించి చెప్పండి ?
ఈ కథ చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది కథాంశం. కథలో అద్భుతమైన సోల్ తీసుకొచ్చారు అనుదీప్. జాతిరత్నాల్లో ప్రతి సీన్ హ్యూమర్స్ గా వుంటుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కూడా ప్రతి సీన్ హిలేరియస్ గా వుంటుంది. నారయణఖేడ్, శంకర్ పల్లి, చేవెళ్ళ ప్రాంతాల్లో ఖుషి సినిమానాటి వాతావరణం రిక్రియేట్ చేసేలా వింటేజ్ లుక్ లో షూట్ చేశాం. అనుదీప్ నారయణఖేడ్ ప్రాంతంలో పెరిగారు. ఆయన రాసే కథలు ఆ ప్రాంతం చుట్టూ జరిగేవే, అక్కడ ఆయన చూసిన వాతావరణంకు తగ్గట్టు లోకేషన్స్ ని ఎంచుకున్నాం.
హాస్య ప్రధానమైన పాత్ర చేయడం ఎలా అనిపించింది ?
కథలో నాకు నచ్చిన అంశం హాస్యం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. నా పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో నా పాత్ర చేయడానికి వంశీ, అనుదీప్, శ్రీజ గారు చాలా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు 20 రోజులు వర్క్ షాప్ చేశాం. ఈ పాత్రని చాలా ఎంజాయ్ చేశా.
ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించారు.. రియల్ లైఫ్ లో ఎవరి ఫ్యాన్ ?
పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే సూర్య గారు అంటే కూడా ఇష్టం.
'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నయా ?
పోకిరి, అత్తారింటికి దారేది, సూర్య గారి సినిమాలు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చుసిన అనుభవాలు వున్నాయి. టికెట్లు దొరక్కపొతే గోడలు దూకి పోలీసులతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి. ఐతే నా కంటే నా ఫ్రండ్స్ ఎక్కువ దెబ్బలు తిన్నారు. (నవ్వుతూ)
'ఫస్ట్ డే ఫస్ట్ షో' కి ఇద్దరు దర్శకులు కదా.,,. ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ?
ఈ కథ సోల్ ని అనుదీప్ ఎంతలా అర్ధం చేసుకున్నారో వంశీ కూడా అంతే సమానంగా అర్ధం చేసుకున్నారు. అనుదీప్ శివకార్తికేయన్ గారి సినిమాతో బిజీ గా వుండటం వలన టెక్నికల్ గా స్ట్రాంగ్ గా వుండే లక్ష్మీనారాయణను మరో దర్శకుడిగా ఎంపిక చేశారు. వంశీ, లక్ష్మీ ఇద్దరూ గొప్ప సమన్వయంతో పని చేశారు. ఎవరి చేతిలో మైక్ వుంటే వాళ్ళే యాక్షన్ కట్ చెప్పేవారు. లక్ష్మీ నాకు టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే.. వంశీ యాక్టింగ్ పరంగా హెల్ప్ చేశారు.
తనికెళ్ళ భరణి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
అంత పెద్ద నటుడి తో కలసి పని చేయడం నా అదృష్టం. ఆయన్ని కలసిన మొదటి రోజే చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు. ఇందులో ఆయనికి కొడుకుగా కనిపిస్తా. మొదటిరోజు కలిసినప్పుడు ''హాయ్ డాడీ' అని పిలిచా. ''చాలా యాక్టివ్ గా వున్నాడు .. పన్జేస్తాడు''అని నవ్వేశారు. ఒక తండ్రిలా చాలా మెళకువలు నేర్పారు. ఆయన అనుభవంతో కొంత యాడ్ చేశారు.
హీరోయిన్ గురించి చెప్పండి ?
ఈ సినిమాలో నవ్వుతూనే వుంటాం. కానీ హీరో హీరోయిన్ సీన్స్ వచ్చినపుడు మాత్రం కాస్త ఆగుతాం. చాలా మంచి లవ్ ట్రాక్. ఒక పది నిమిషాల తర్వాత హీరో హీరోయిన్ ని మన పక్కింటి వాళ్ళలానే ట్రీట్ చేస్తారు ప్రేక్షకులు. హీరోయిన్ పాత్రలో అమాయకత్వం వుంటుంది. అలాంటి అమ్మాయి టికెట్స్ అడిగితే నేనూ ట్రై చేస్తానని ప్రేక్షకులు ఫీలౌతారు.
వెన్నెల కిషోర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
వెన్నెల కిషోర్ గారిది ఇందులో చిన్న పాత్రే అయినా కీలకమైన పాత్ర. మొదట్లో చేస్తారో లేదో అనే అనుమానం వుండేది. ఐతే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయన చేయడానికి అంగీకరించారు. ఆయన సెట్ కి వచ్చిన ప్రతి రోజు నవ్వుతూనే వున్నాం. పవన్ కళ్యాణ్ గురించి ఒక సీన్ వుంటుంది. ఆ సీన్ ని తన అనుభవాన్ని యాడ్ చేసే అద్భుతంగా చేశారు. అది మీరు థియేటర్లోనే చూడాలి.
ప్రమోషన్స్ హిలేరియస్ గా చేస్తున్నారు కదా ?
అవును.. అనుదీప్ నాకు తొమ్మిదేళ్ళుగా తెలుసు. ఆయన మాట్లాడుతూనే ఎవరూ హార్ట్ కాకుండా పంచ్ వేయగలడు. అయితే ఆ పంచ్ కి ఆయన ఏ మాత్రం నవ్వకపోవడం మరో ప్రత్యేకత. ప్రమోషన్స్ ని హిలేరియస్ గా డిజైన్ చేసే ఆలోచన అనుదీప్ దే. ఏం చేసిన హ్యూమరస్ గా వుండాలని భావిస్తాడు.
ఇండస్ట్రీలో అనుదీప్ మీ గాడ్ ఫాదర్ అనుకోవచ్చా ?
గాడ్ ఫాదర్ అనడం కంటే మంచి స్నేహితుడు, బ్రదర్ అని భావిస్తా. సినిమానే కాకుండా వ్యక్తిగతంగా అనుదీప్ అంటే చాలా ఇష్టం. సినిమా లేకపోయినా కూడా ఏ పరిస్థితిలోనూ ఆయన్ని వదులుకోను. ఆయన కథలు నాతో పంచుకుంటారు. మీరు గమనిస్తే జాతిరత్నాలు సినిమాలో హీరో పేరు శ్రీకాంత్. పిట్టగోడ సినిమా జరుగుతున్నప్పుడే ఆ కథ చెప్పారు. సూపర్ హిట్ అని అప్పుడే చెప్పా.
'ఫస్ట్ డే ఫస్ట్ షో' మ్యూజిక్ గురించి ?
రధన్ గారు నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలతో పాటు నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశారు.
మీరు ఎలాంటి కథలు చేయాలని అనుకుంటున్నారు ?
నాకు అన్ని కథలు చేయాలనీ వుంటుంది. ఐతే కామెడీ, లవ్ స్టోరీస్ ఇష్టం.
నిర్మాతలు నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ?
సినిమా చూసిన తర్వాత శ్రీజ, శ్రీరామ్ గారు అద్భుతంగా చేశావని చెప్పారు. పూర్ణోదయ బ్యానర్ లో నేనూ ఒక భాగం అవ్వడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది ఒత్తిడి వుంటుందా ?
కొంచెం టెన్షన్ అయితే వుంది. అయితే మేము అనుకున్న కంటెంట్ ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. ప్రేక్షకులు 'ఫస్ట్ డే ఫస్ట్ షో'ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
గీత దాటకుండా “డిజె టిల్లు” తెరకెక్కించాను – దర్శకుడు విమల్ కృష్ణ
ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి 'డిజె టిల్లు' చిత్రాన్ని చూడొచ్చని చెబుతున్నారు దర్శకుడు విమల్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన 'డిజె టిల్లు' చిత్రాన్ని...
లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఛలో ప్రేమిద్దాంః’ చిత్ర నిర్మాత ‘ఉదయ్ కిరణ్’!!
మ్యూజిక్ కి స్కోపున్న సినిమా ఛలో ప్రేమిద్దాంః సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో
బ్లాక్ అండ్ వైట్, ప్రియుడు సినిమాలతో టాలీవుడ్ లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్...
‘రాజా విక్రమార్క’ టైటిల్ పెట్టానని చిరంజీవిగారికి చెప్పాను… ‘గుడ్ లక్’ అన్నారు- హీరో కార్తికేయ ఇంటర్వ్యూ
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు ధైర్యం ఎక్కువ. ఆయన పేరు చెబితే ముందు 'ఆర్ఎక్స్ 100' గుర్తుకు వస్తుంది. అటువంటి న్యూ ఏజ్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. కార్తికేయకు ఉంది కాబట్టే...
కార్తికేయ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ కోస్టార్ – ‘రాజా విక్రమార్క’ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ఇంటర్వ్యూ
తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతిభావంతులైన కొత్త కథానాయికలకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. ఆహ్వానం అందుకుని తెలుగు తెరకు వస్తున్న నూతన కథానాయిక తాన్యా రవిచంద్రన్. 'రాజా విక్రమార్క' సినిమాలో కార్తికేయకు జంటగా నటించారు....
మంచి రోజులొచ్చాయి - హీరో సంతోష్ శోభన్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ.
మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'మంచి రోజులు వచ్చాయి'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్ లోకి వస్తుంది....
”వరుడు కావలెను” చిత్రానికి నిర్మాతే హీరో – దర్శకురాలు ‘లక్ష్మీ సౌజన్య’!!
యూత్, ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ‘వరుడు కావలెను’
నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్...
“లవ్ స్టోరి” ప్రతి అమ్మాయి, మహిళ తప్పక చూడాల్సిన సినిమా – హీరోయిన్ సాయి పల్లవి!!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది....
”డియర్ మేఘ” నా డ్రీమ్ మూవీ – హీరోయిన్ మేఘా ఆకాష్!!
అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా ''డియర్ మేఘ'' సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా...
నా ప్రతి సినిమా ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ – నిర్మాత బెక్కం వేణుగోపాల్!!
తెలుగు సినీ పరిశ్రమలో చక్కటి అభిరుచి ఉన్న నిర్మాతల్లో లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్ ఒకరు. టాటా బిర్లా మధ్యలో లైలా వంటి సూపర్‌హిట్ సినిమాతో నిర్మాతగా కెరీర్ పెట్టి ఎన్నో...
‘వైల్డ్‌డాగ్’ మూవీతో టాలీవుడ్‌లో నాకు మరిన్ని అవకాశాలు వస్తాయిని నమ్ముతున్నాను – హీరోయిన్ దియామీర్జా!!
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'వైల్డ్ డాగ్' సినిమాలో ఆయనకు జోడీగా కనిపించనుంది బాలీవుడ్ భామ దియా మీర్జా..ఈ చిత్రాన్ని అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్...
”సుల్తాన్” కథ విన్నప్పుడే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది – హీరో కార్తి!!
ఖైది, దొంగ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత కార్తి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా...
అక్కాతమ్ముడు కలిసి ఇలా స్కాం చేయడమనేది నన్ను ఆకట్టుకుంది : బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి!!
బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మంచు విష్ణు మోసగాళ్లు చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సునీల్ శెట్టి మీడియాతో...
‘రంగ్ దే’ ఆల్బమ్‌లో నాలుగు పాటలు నాలుగు రకాలుగా ఉండి అలరిస్తుండటం ఆనందంగా ఉంది : గేయరచయిత శ్రీమణి
'రంగ్ దే'లో ప్రతి పాటా నాకో ఛాలెంజేఅన్ని పాటలకూ మంచి సందర్భాలు కుదిరాయి
స్వల్ప కాలంలోనే తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన గేయరచయిత శ్రీమణి. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భం...
‘చెక్’ సినిమా, అందులో నా పాత్ర మానస ప్రేక్షకులకు బాగా నచ్చాయి – రకుల్ ప్రీత్ సింగ్
తెలుగులోనూ వాణిజ్య హంగులతో కూడిన కొత్త తరహా చిత్రాలు వస్తాయని చెప్పడానికి ‘చెక్’ తాజా ఉదాహరణ. విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మార్క్ కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమాలో రకుల్...
ఆ రికార్డ్ నాకు తప్ప మరే హీరోయిన్ కు లేదు – “అక్షర” హీరోయిన్ నందితా శ్వేత
“ఎక్కడికిపోతావు చిన్నవాడా” చిత్రంతో టాలెంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ నాయిక నందితా శ్వేత. ఆ తర్వాత “ప్రేమ కథా చిత్రమ్ 2”, “శ్రీనివాస కళ్యాణం” లాంటి చిత్రాల్లో ఆకట్టుకుంది....
“క్షణక్షణం” మూవీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా కూర్చోబెడుతుంది – హీరో ఉదయ్ శంకర్
కొత్త కంటెంట్ తో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు యంగ్ హీరోఉదయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "క్షణక్షణం" శుక్రవారంప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మన మూవీస్ బ్యానర్ లో...
లౌక్యం’ సక్సెస్ తర్వాత ఆనందప్రసాద్ గారు ఐఫోన్ లు ఇచ్చారు. ‘చెక్’కి అంతకంటే పెద్దగిఫ్ట్ అడగాలి! – సంపత్...
సంపత్ రాజ్… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తోప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో...
జైలులో పవన్‌గారి ఫొటో పెడితే బాగోదు – నితిన్ ఇంటర్వ్యూ
యూత్ స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమా...
‘చెక్’ సినిమా కోసం అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశాను – ప్రియా ప్రకాశ్ వారియర్ ఇంటర్వ్యూ
ప్రియా ప్రకాశ్ వారియర్... యువతరం ప్రేక్షకులు ఈ అమ్మాయిని మర్చిపోవడం అంత సులభం కాదు. ఆమె కన్నుగీటిన దృశ్యాన్ని మరువడం మరీ కష్టం. ఇప్పుడీ అమ్మాయి స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించింది. యూత్...
70 ఎమ్ఎమ్ సినిమా గురించి హీరోయిన్ అక్షత శ్రీనివాస్ ఇంటర్వ్యూ
జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్.యస్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ 70 ఎమ్.ఎమ్’. రాజశేఖర్, ఖాసీం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అక్షత శ్రీనివాస్...
`జాను` సినిమాను చూసిన ప్రేక్షకులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు కనెక్ట్ అవుతారు : దిల్‌రాజు
శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు,...