నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రంలో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను…హీరోయిన్ సోను ఠాగూర్ ఇంటర్వ్యూ

లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో వస్తున్న “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రంలో నటించడం గ్రేట్ గా  ఫీల్ అవుతున్నాను…హీరోయిన్ సోను ఠాగూర్  ఇంటర్వ్యూ

ఈ నెల 9 న “నేను మీకు బాగా కావాల్సినవాడిని” గ్రాండ్ రిలీజ్

కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం  “నేను మీకు బాగా కావాల్సినవాడిని”.ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన లాయర్ పాప.. లవ్ జైల్లో ఉన్న..బెయిల్ ఇచ్చి పోరాదే..పాట,“నచ్చావ్ అబ్బాయి” వంటి పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో  సెకండ్ లీడ్ రోల్ లో నటించిన సోను ఠాగూర్ పాత్రికేయులతో మాట్లాడుతూ

చిన్నప్పటి నుండి నాకు సినిమా అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఆ తరువాత నేను మోడల్ గా కేరీర్ ప్రారంభించాను. మోడలింగ్ చేస్తున్న టైమ్ లోనే “జోరుగా హుషారుగా” సినిమాలో ఒక మంచి సాంగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో పాటకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మొదట  మంచి బ్యానర్ గానీ  లేక  మంచి కాస్ట్ గానీ , మంచి స్క్రిప్ట్ ఉండే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అనుకున్నట్లే  ఎన్నో హిట్స్ ఇచ్చిన లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో అందులో తన కూతురు కోడి దివ్య దీప్తి  నిర్మాతగా  చేస్తున్న  సినిమాలో హీరో కిరణ్ తో
యాక్ట్ చెయ్యాలి అనగానే చాలా సంతోషం వేసింది.

మోడల్ గా ఎక్సపీరియన్స్ ఉండడం వలన సినిమాలో నటించడం చాలా ఈజీగా అయింది..ఇందులో డ్యాన్స్ కు ఎక్కువ స్కోప్ ఉండడంతో ఈ సినిమాలో లాయర్ పాప సాంగ్ చేశాను. ఈ పాటకు  ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో నాకు రన్ టైమ్ తక్కువ ఉన్నా ఫుల్ ఫన్ ఉంటుంది.బాబా భాస్కర్ తో నాకు సీన్స్ ఉన్నా తనతో  వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. తను ఆన్ స్క్రీన్ పై ఎలా ఉంటాడో, ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటాడు.

చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత దీప్తి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు.కో స్టార్ కిరణ్ చాలా కూల్ పర్సన్ తనతో కలసి డ్యాన్స్ చేయడం హ్యాపీ గా ఉంది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. తన సంగీతంలో వర్క్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే తన మ్యూజిక్ లో వచ్చే లాయర్ పాప పాటను చూసే ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి డ్యాన్స్ వేసే విధంగా ఈ పాట  ఉంటుంది. ఈ నెల 9 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించారు.