Kamal Hassan: దివంగత తమిళ స్టార్ ఎంజీఆర్ తన సినిమాలతో తమిళనాడు ప్రజానీకాన్ని ఎంతో అలరించారు. ఈ నేపథ్యంలో ఆయన 1967లో రాజకీయ పార్టీని స్థాపించి.. 1976వరకు ఎంజీఆర్ తమిళ సీఎంగా ఉన్నాడు. అయితే విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం)పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఎంజీఆర్ పోటీ చేసిన చెన్నైలోని అలందర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ చేసేందుకు నిశ్చయించుకున్నారని వార్తాలు వెలువడుతున్నాయి.
బుధవాం అక్కడి నుంచే రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని వెల్లడించాయి. KamalHassanకమల్ ముందు నుంచీ తన ప్రచారంలో ఎంజీఆర్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కాగా బుధవారం రాత్రి 8గంటలకు మైలాపూర్‌లో కమల్ బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.. ఇక మార్చి 7న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ ప్రకటించనుంది.