ఇటీవలే విడుదల మలయాళ అయిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా అటు మలయాళం లోనే కాకుండా వేరే భాషల్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ సినిమా కథ నిజ జీవిత సంఘటనల నుండి తీసుకోవడంతో ప్రేక్షకులకు మరింత ఎక్కువగా కనెక్ట్ అయింది. తమిళనాడు రాష్ట్రంలోని ఒక కొండ ప్రాంతంలో ఉండే కొన్ని గుహలలో గతంలో కమల్ హస్సన్ హీరోగా గుణ అనే ఒక సినిమా తీయడం జరిగింది. అంతే కాకుండా ‘కన్మణి’ అంటూ ఇళయరాజా పాడిన ఓ పాత అదే గుహలలో తీయడం, ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడం జరిగింది.
ఇది ఇలా ఉండగా ఇళయరాజా పాడిన ‘కన్మణి’ అనే పాటను ఇటీవలే విడుదల అయిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో ఉపయోగించడం జరిగింది. తన అనుమతి లేకుండా తన పాటను సినిమాలో ఉపయోగించారు అంటూ ఇళయరాజా ఈ విషయమై కోర్టుకి వెళ్లి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. చివరికి నిన్న కోర్ట్ తీర్పును ఇస్తూ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా టీం నుండి 60 లక్షలు ఇళయరాజాకు ఇవ్వాలని తీర్పును ఇవ్వడంతో ఈ సమస్య ఇంతటితో ముగిసింది.