Cine Industry: నిర్మాతల శ్రేయస్సే కోసం IFMA (ఐఎఫ్ఎంఏ) ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు తెలంగాణ IFMA (ఐఎఫ్ఎంఏ) ఇంచార్జి రామచంద్ర రెడ్డి. ప్రోడ్యూసర్లు సినిమాలతో నష్టపోకుండా వారికి అన్ని సేవలు అందించడానికి ఈ అసోసియేషన్ ఏర్పడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పటు చేసి IFMA (ఐఎఫ్ఎంఏ) లోగో లాంచ్ చేశారు. Cine Industryఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టిందని… ఇప్పటి వరకు మొత్తం 9 రాష్ట్రాల్లో నిర్మాతలకు, సినిమాలోని 24 శాఖలకు పలు సేవలు అందిస్తుందని తెలిపారు.ఐ ఎఫ్ ఎం ఏ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే నిర్మాతలకు టైటిల్ రెజిస్ట్రేషన్ నుండి పబ్లిసిటీ మరియు సినిమా విడుదల వరకు కార్పోరేట్ స్థాయిలో అన్ని సంస్థే చూసుకుంటుందని, Cine Industry24 శాఖల వారు సభ్యత్యం తీసుకుంటే వారికి ESI, PF సౌకర్యం ఉంటుందని తెలిపారు.
Cine IndustryIFMA (ఐఎఫ్ఎంఏ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ విజయ జాలాది మాట్లాడుతూ…సమాజ శ్రేయస్సు కోసం జాతిని జాగృతి చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పడిందని 24 శాఖల కళాకారులు ఇందులో సభ్యత్వం తీసుకుంటే వారికి సంస్థ అండగా ఉంటుందన్నారు. సెంట్రల్ బ్యూరో నియమ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుతాయని, నిర్మాతలు ఈ అసోసియేషన్ లో సభ్యత్యం తీసుకుంటే అన్ని విధాలుగా మేము Cine Industryనిర్మాతలకు సినిమా విడుదల వరకు సేవలు అందిస్తామని అన్నారు.
Cine Industry IFMA(ఐఎఫ్ఎంఏ) మీడియా ఎంటర్టైన్మెంట్ సలహాదారులు ప్రతిభా పులిజాల మాట్లాడుతూ… ఈ అసోసియేషన్ కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, నిర్మాతల క్షేమం కోసం వారు మోసపోకుండా ఉండడానికి మేము వారికి అండగా ఉంటూ సేవలు అందిస్తామన్నారు. IFMA(ఐఎఫ్ఎంఏ) సభ్యులు రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ… కరోనా సమయంలో నిర్మాతలకు ఎవరు అండగా లేరని వీరు ఎంతో నష్టపోయరని, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే వీరికి సరైన గుర్తింపు లేదని మా అసోసియేషన్ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే వారికి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ, సినిమా విడుదల వరకు నిర్మాతకు ఎక్కడ మోసం జరుగకుండా మేము అండగా ఉంటామని తెలిపారు.Cine Industry ఈ కార్యక్రమంలో ప్రతిభా పులిజాల, విజయ జాలాది, పి. రామచంద్ర రెడ్డి, రాజీవ్, భీమా నిషాంత్, కర్ణాటక IFMA సెక్రెటరీ దిలీప్ పాల్గోన్నారు.