కనక వర్షం కురిపిస్తున్న ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 : ది రూల్’ కలెక్షన్స్

బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భారీ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కలెక్షన్ల రూపంలో జేబులు నింపుతూ కనక వర్షం కురిపిస్తుంది. ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటి రోజు 294 కోట్లు వసూళ్లతో కొత్త రికార్డు సృష్టించింది. హిందీలో జవాన్ సినిమా 65 కోట్ల వసూళ్లతో ఉన్న రికార్డును తిరగరాస్తు 72 కోట్లతో కొత్త రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో ఒక డబ్బింగ్ సినిమాకు 11 కోట్ల వసూళ్లతో కొత్త డే1 రికార్డు సృష్టించింది.

అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో తెలుగు సినిమా ఓపెనింగ్ మాత్రమే కాకుండా, కేరళ సినిమా బాక్స్ ఆఫీసులో 2024లో లేని విధంగా 6.5 కోట్లతో కొత్త రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఓవర్సీస్ లో 2024లో ఒక భారతీయ సినిమా చేయినంత కలెక్షన్ 6 మిలియన్ డాలర్లతో తెలుగువారు గర్వించే విధంగా నిలిచింది. నైజాం ప్రాంతంలో 30 కోట్ల కలెక్షన్స్ తో, కృష్ణాజిల్లాలో 4.42 కోట్ల కలెక్షన్స్ తో, అలాగే ఉత్తరాంధ్రలో 7.78 కోట్ల కలెక్షన్స్ తో ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది. అదేవిధంగా మల్టీ స్టారర్ కానీ చిత్రంగా ఇంతవరకు ఎన్నడూ లేని స్థాయిలో 12.5 కోట్ల సీడెడ్ కలెక్షన్స్ తో కొత్త రికార్డు సృష్టించింది.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రం ఎంతో వేగంగా కలెక్షన్స్ పెరుగుతూ, రికార్డులు అన్ని మార్చి వేస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ‘పుష్ప 2 : ది రూల్’ ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.