రాజమౌళి ప్లాన్ ఫాలో అవుతున్న పుష్ప టీమ్, ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో భారి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బర్త్ డే సంధర్భంగా బయటకి వచ్చిన ఈ అనౌన్స్మెంట్ ప్రకారం పుష్ప ఫస్ట్ సాంగ్ ఆగస్ట్ 13న విడుదల కానుంది. దాక్కో దాక్కో మేక అంటూ రానున్న ఈ పాటని ఒక్కో భాషలో ఒక్కో టాప్ సింగర్ పాడనున్నాడు.

రాజమౌళి ట్రిపుల్ ఆర్ లోని దోస్తీ సాంగ్ కోసం టాప్ సింగర్స్ ని రంగంలోకి దించినట్లే… పుష్ప సాంగ్ కోసం దేవి… తెలుగు కోసం శివంని, హిందీ కోసం విశాల దడ్లాని, విజయ్ ప్రకాష్ కన్నడ, మలయాళం రాహుల్ నంబియార్, బెన్నీ డయాల్ తమిళ్ వెర్షన్ పాడనున్నారు. ఈ టాప్ సింగర్స్ దాక్కో దాక్కో మేక పాటనివారి వారి భాషల్లో పాడారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ అల వైకుంటపురములో మూవీ క్లైమాక్స్ లో వచ్చే పులోచ్చింది, మేక చచ్చింది అనే డైలాగ్ ని బేస్ చేసుకోని పుష్ప ఫస్ట్ సాంగ్ కి ఈ నేమ్ పెట్టినట్లు ఉన్నారు. సుకుమార్ సినిమా అనగానే దేవి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడు… అలాంటిది అల్లు అర్జున్ కూడా కలిసాడు కాబట్టి పుష్ప ఆల్బం చార్ట్ బస్టర్ అవ్వడం గ్యారెంటి. దీనికి పునాదే ఈ దాక్కో దాక్కో మేక సాంగ్.

అయితే ఈ అనౌన్స్మెంట్ వీడియోలో ఇచ్చిన చిన్న గ్లిమ్ప్స్ లో మాత్రం దాక్కో దాక్కో మేక ట్యూన్ పవన్ కళ్యాణ్ జల్సా మూవీలోని చలోరే చలోరే చల్ పాట ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రమ్ బీట్, జల్సా మూవీలో విన్నట్లుగా అనిపిస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్ సాంగ్ బయటకి వస్తే కానీ ఆ కామెంట్స్ ని నిజమెంత అనేది తెలియదు.