చిత్ర పరిశ్రమలో పది సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనమామ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఈ విధంగా ప్రస్తావించారు. “నేను చిన్నప్పటినుండి ఎక్కువగా కళ్యాణ్ గారి దగ్గర పెరిగాను. ఒక చదువు విషయంలోనే కాదు, ఆయన ప్రతి విషయంలోనూ చాలా విషయాలు నాకు ఒక గైడ్ గా ఉంటూ ముందుకు వెళ్లిన చేశారు. నేను వెన్ను తిరగకుండా ఉండే లక్షణం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఉదాహరణకు నేను చిన్నప్పుడు ఒక టెన్నిస్ టోర్నమెంట్లో ఓడిపోయి వస్తే ఆయన నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను టోర్నమెంట్ గెలిచాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడం జరిగింది. అదే సంఘటన నేను ఇటీవల కళ్యాణ్ గారు గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత రీ క్రియేట్ చేస్తూ ఆయనను ముద్దు పెట్టుకోవడం జరిగింది. అది నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన.”
“అదేవిధంగా బ్రో సినిమాలో ఆయనతో కలిసి నటించడం నాకు ఎంతో సంతోషం అందించింది. సుమారు 25 రోజులు పాటు ఈ మధ్య కాలంలో ఆయనతో నేను కలిసి ఉన్నాను. నాకు ఆయనతో కలిసి నటించడం గురువుకు గురుదక్షిణ ఇచ్చినట్లు అనిపించింది. ఎంతో గర్వంగా నేను ఫీలయ్యాను. నేను కళ్యాణ్ గారితో నటించాను అని ఒక గర్వమైన ఫీలింగ్ నాకు కలిగింది.”
“అదే విధంగా రాజకీయాల్లో ఆయన ప్రస్తుతం ఏ శాఖలయితే తీసుకుని పనిచేస్తున్నారో అవి ఆయనకు చాలా ఇష్టమైన శాఖలు. పంచాయతీరాజ్, పర్యావరణం, సైన్స్ అండ్ డెవలప్మెంట్ శాఖలో ఆయనకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా ఆయన చదివిన పుస్తకాలు గానీ, ఆయన చిత్రాలలో కొన్ని డైలాగ్స్, అలాగే కొన్ని పాటలు కానీ పర్యావరణానికి సంబంధించినవి ఉంటాయి. ఆయన తన బాధ్యతలను ఎంతో బాగా నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది” అన్నారు.