నేను ఇటువంటి క్యారెక్టర్జేషన్ గతంలో ఎప్పుడు చేయలేదు : ‘గేమ్ చేంజెర్’ సినిమా గురించి నటుడు శ్రీకాంత్

కార్తీక్ సుబ్బరాజ్ కథ రాయగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్, ఆదిత్య రామ్ నిర్మాతలుగా జనవరి 10వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్, కైరా అద్వానీ జంటగా ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ తిర్రు, రత్నవేలు సినిమాటోగ్రఫీలో ఈ చిత్రం రాడుంది. సంగీత దర్శకుడుగా ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ పనిచేయడం మరో విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు టీజర్ మంచి బజ్ తెప్పించగా టీజర్ లంచ్ ఈవెంట్ లక్నో నగరంలో జరపడం మరింత విశేషంగా ఎక్కువ బజ్ రావడం జరిగింది. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న సమయంలో గేమ్ చేంజర్ గురించి హీరో శ్రీకాంత్ మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.

  • నేను ఇలా ఒక కేరక్టర్ చేయడం ఇదే మొదటిసారి. కాకపోతే గెటప్ వేయడం ఒక చాలెంజ్. ఆ గెటప్ సెట్ అయ్యాక కచ్చితంగా చేయాలి అని అనుకున్నాను.
  • శంకర్ అనే దర్శకుడితో చాల కంఫర్గా ఫీల్ అయ్యాను. ఆయన ముందు నుండి ఆర్టిస్ట్, కాబట్టి ఆయనకి తెలుసు నటుడికి ఎలా ఉంటుంది.
  • నా కేరక్టరైసేషన్ లో పాజిటివ్ & నెగటివ్ ఉంటాయి.
  • గెటప్ తగ్గట్లు ఆ వయస్సులో ఎలా ఉంటారో అలాగే నా కేరక్టర్ ఉంటుంది. ఏ సిఎం కేరక్టర్ ని ఇమిటేట్ చేసినట్లు ఉండదు.
  • సిఎంగా నా కేరక్టర్ చాల ఇంపార్టెన్స్ గా ఉంటుంది.
  • సినిమాలో అందరి నటులతోనూ నా కేరక్టర్ కాంబినేషన్స్ ఉంటాయి.
  • ఎస్ జె సూర్య కేరక్టర్ అన్ని రకాలుగాను ఉండబోతుంది. అన్ని కోణాలలో ఎంటర్ట్ టైన్ చేస్తారు.
  • వయస్సును మించిన కేరక్టర్ అనగానే కొంచం తడబడ్డాను కానీ కథ విన్నాక ధైర్యంగా అనిపించింది.
  • గెటప్ తో ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు.
  • శంకర్ దర్శకత్వంలో ఇటువంటి ఒక కేరక్టర్ వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు.
  • రామ్ చరణ్ అప్పన్న కేరక్టర్ చేయాలి అంటే చాల ఎక్సపీరియన్స్ కావాలి. సినిమాలో అన్ని కేరక్టర్ నాకు చాల నచ్చాయి.
  • అఖండ లాంటి కేరక్టర్ ఎప్పుడు నేను చేయలేదు, కానీ ఆపరేషన్ దుర్యోధన లాంటి కేరక్టర్ తీసుకున్నారు కాబట్టి ధైర్యంగా చేశాను.
  • రామ్ చరణ్ నన్ను అన్న అని పిలుస్తారు. యువ మెగా హీరోలు అందరూ నన్ను అలాగే అన్న అని పిలుస్తారు.
  • సినిమాలో ఎలివేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, కథ కూడా ఉండాలి. ఈ సినిమా అలాంటిదే. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది.
  • ఈ సినిమా ఒకటే పార్ట్. రాజమండ్రిలో 15 రోజులు సినిమా చేశాం.
  • సినిమా ఇన్ని రోజులు కావడానికి ముఖ్య కారణం ఆర్టిస్ట్ అందరి కాంబినేషన్స్ & డేట్స్ వల్ల. అందుకే ఈ సినిమా ఎక్కువ టైం పట్టింది.
  • శంకర్ సినిమా అంటే పొలిటికల్ గా ఒకే ఒక్కడు, కానీ ఈ సినిమా నేటి రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయి.
  • నేను హీరోగా అనే కాదు, కేరక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా చేయడం కూడా ఇష్టమే.
  • SYG రెండు బాగాలుగా ఉండబోతుంది. ఆ సినిమాలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఉండబోతుంది.
  • ఖడ్గం సినిమా రీ రిలీజ్ కావడం నాకు చాల నచ్చింది. పెళ్లి సందడి కూడా వస్తే బాగుండు అనుకుంటున్నాను.
  • నిర్మాణం, దర్శకత్వంలో అస్సలు మక్కువలేదు.
  • అల్లు అర్జున్ విషయంలో అలా జరగడం అనుకోకుండా జరిగింది. కాకపోతే చట్టానికి మనం బద్ధుడై ఉండాలి కాబట్టి తప్పదు.