చైతన్య అనే ఒక వ్యక్తి తన పేరు చెప్పి చాలా మందిని మోసం చేస్తున్నాడని సింగర్ సునీత ఒక వీడియో ద్వారా వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అతను నా బంధువు అని, చాలా క్లోజ్ అని చెప్పుకుంటూ.. చాలా మంది యువతి యువకులకు అవకశాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్లు ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు.
సునీత మాట్లాడుతూ.. చైతన్య అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతనిని నేను ఇంతవరకు కలవలేదు. నా పేరు చెప్పుకొని ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఒక ఆర్టికల్ ద్వారా తెలిసింది. నిజంగా అతను నాకు తెలియదు. అయితే అలాంటి వారి మాటలు ఎవరు కూడా నమ్మవద్దు. ఈ విషయం నన్ను చాలా బాధకు గురి చేసింది. ఈ విషయం అంత ఈజీగా వదిలి పెట్టను.
తప్పకుండా చీట్ చేసిన వ్యక్తిపై కంప్లైట్ చేస్తాను. అతను కనిపిస్తే పళ్ళు రాలగొడతాను అంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో తన పేరు చెప్పుకొని ఇలాంటి వారు వస్తే ఏ మాత్రం మమ్మవద్దు అని కనీసం సోషల మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా కూడా ఎంత మాత్రం నమ్మవద్దని చాలా జాగ్రత్తగా ఉండాలని సునీత వివరణ ఇచ్చారు.