బిగ్ బాస్4 రూమర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రద్దా దాస్

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగులో మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెగేలిసిందే. ఇప్పటికే అఫీషియల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ఆగస్ట్ చివరి వారంలోనే షో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హౌజ్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 4లో శ్రద్దా దాస్ కూడా కంటెస్టెంట్ గా రానున్నట్లు కొన్ని మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై శ్రద్దా దాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ కోసం తనను ఎవరు సంప్రదించలేదని చెబుతూ.. ఆ షోలో పాల్గొనడం తనకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని కూడా తెలిపింది. అయితే తను బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి ఇలాంటి తప్పుడు వార్తలు వస్తే… చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని శ్రద్దా ఘాటుగా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది.