సింగిల్ గానే ఉన్నా..డేటింగ్ రూమర్స్ పై ‘రష్మీక మందన్న’!!

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మీక మందన్న తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. మెల్లమెల్లగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ తన రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచింది. ఇక ఆమె కెరీర్ మొదటి నుంచి డేటింగ్ రూమర్స్ వెంటాడుతున్న విషయం తెలిసిందే.

అయితే మరొసారి రష్మీక ఆ రూమర్స్ కి స్వీట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా పేరుతో రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారికి ఈ విషయాన్ని చెబుతున్నా.. నేను సింగిల్ గానే ఉన్నాను. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపదుతున్నా. అదే నా ప్రేమ. మీరు ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీకే అర్ధమవుతోంది అని రష్మీక డిఫరెంట్ ఒక కొటేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక 2017లోనే ఈ బ్యూటీ కన్నడ స్టార్ రక్షిత్ తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఏడాది అనంతరం విడిపోగా ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. అందులో కూడా ఎలాంటి నిజం లేదని అప్పుడే రష్మీక వివరణ ఇచ్చింది.