జనసేన ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై హైపర్ ఆది స్పందన

తనకు జనసేన నుంచి MLC ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమెడియన్ హైపర్ ఆది స్పష్టం చేశారు. ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. పవన్ సంతోషంగా ఉంటే దూరం నుంచి చూస్తానని, బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని ఆది వ్యాఖ్యానించారు. ఇక అల్లు అర్జున్ పై ట్రోలింగ్ ఆయన కోరారు.నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక స్టార్ హీరో పై ఎటువంటి ట్రోలింగ్ కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య బాండింగ్ ఎప్పుడు బాగానే ఉంటుందని ఆయన అన్నారు.