హల్ చల్ సినిమా సెన్సార్ పూర్తి.. నవంబర్ లో విడుదల

hulchal-movie

రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం హల్ చల్. శ్రీపతి కర్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా హల్ చల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది ఈ చిత్రం. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. భరత్ మధుసూదనన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలో ప్రత్యూష కొల్లూరి సమర్పిస్తుండగా గణేష్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:
రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ..

సాంకేతిక నిపుణులు:
రచన దర్శకుడు: శ్రీపతి కర్రి
నిర్మాత: గణేష్ కొల్లూరి
సమర్పణ: ప్రత్యూష కొల్లూరి
నిర్మాణ సంస్థ: శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్: సుజాత బిజిగిరి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
సంగీతం: భరత్ మధుసూదనన్
PRO: వంశీ శేఖర్