విజయ్, కార్తీల్లో ఎవరి లెక్క ఎంత అనేది లాంగ్ రన్ లోనే తేలనుంది

దళపతి విజయ్ నటించిన బిగిల్ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. దీనికి పోటీగా రానున్న కార్తీ ఖైదీ కూడా కంటెంట్ నే నమ్ముకోని థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే విషయం కాసేపు పక్కన పెడితే, బిగిల్ సినిమాపై ఉన్న హైప్ కారణంగా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమిళనాట మొత్తంగా 1571 స్క్రీన్స్ ఉన్నాయి. వీటిలో అక్టోబర్ 25న బిగిల్ సినిమాకే చాలా వరకూ థియేటర్స్ ని కేటాయించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు తమిళ సినిమా ముందెన్నడూ చూడని కలెక్షన్స్ ని బిగిల్ చూపించబోతోందని అందుకు తగ్గట్లుగానే దాదాపు వెయ్యి థియేటర్స్ లో బిగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి నటించిన సంగ తమిళన్ రేస్ నుంచి తప్పుకోవడంతో మిగిలిన థియేటర్స్ అన్నింటిలో ఖైదీ మాత్రమే ప్రేక్షకుల ముందుకి రానుంది.

kaithi vijay

స్పోర్ట్స్ డ్రామాలో తెరకెక్కుతున్న బిగిల్ సినిమాతో పోల్చుకుంటే ఖైదీ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే రెండు వేరు వేరు జనర్స్ లో తెరకెక్కిన సినిమాలు కావడం సినీ అభిమానులకి రెండు చిత్రాలని చూడాలనే క్యూరియాసిటీ ఉంది. బిగిల్ కన్నా రెండు రోజుల ముందు ఖైదీ రిలీజ్ కానుండడం, కార్తీకి కలిసొచ్చే అంశం. కథలో విషయం ఉంది అనే టాక్ స్పెర్డ్ అయితే ఖైదీ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది. బిగిల్ వచ్చే లోపు ఖైదీ మంచి వసూళ్లు రాబట్టగలదు. అలాగే బిగిల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి మంచి ఓపెనింగ్స్ రాబట్టనుంది, సో బిగిల్ ఇన్స్టాంట్ హిట్ అవడం ఖాయం. మరి మంచి ఓపెనింగ్స్ రాబట్టనున్న రెండు సినిమాల్లో లాంగ్ రన్ లో నిలబడి ప్రేక్షకులను మెప్పించే మూవీ ఏదో చూడాలి.