శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో చేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కియారా అద్వానీ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ రేట్ పై ఎప్పుడు ఒక ఆసక్తి ఉంటూనే ఉంటుంది. టికెట్ రేట్లు పెరగటం అలాగే బెనిఫిట్ షోడు ఇంకా సాధారణంగా ఉండే కంటే ఎక్కువ షోలు పడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. అదే తరహాలో ఇంకేం చేంజ్ చిత్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ జీవో విడుదల చేసింది. అదేవిధంగా మొదటి రోజున 6 వేసుకోవచ్చు అంటూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ వార్త గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ కు శుభవార్త అనే చెప్పుకోవాలి. జనవరి 9న అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ షోకు 600 రూపాయలు టికెట్ రేటు ఫిక్స్ చేశారు.
అదేవిధంగా ఆ తర్వాత నాలుగు గంటల నుండి షో వేసుకునే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్టీప్లెక్స్ లలో జీఎస్టీతో కలిపి 150 రూపాయలు పెంచుకునే అవకాశం, సింగల్ స్క్రీన్ లో జీఎస్టీ తో కలిపి 135 రూపాయలు వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే 11వ తేదీ నుండి 23 వరకు రోజుకు 5 షోస్ వేసుకునే అవకాశం కలిగించింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇటీవల జరిగిన కొన్ని సంఘటన వల్ల కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్ షోలు లేదా టికెట్ పై రేట్లు పెంచల ఇకపై ఉండబోవు అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణలో గేమ్ చేంజెర్ చిత్రానికి బెనిఫిట్ షో లు ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ ఉంటే ఆ షోల టికెట్ రేట్లు ఎలా ఉంటాయి? లేదంటే సాధారణంగా ఉండే షోలకి టికెట్ రేట్లు పెంచే అవకాశం ఏమైనా ఉందా? లేదా? అనే ప్రశ్నలకు ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి.