కీర్తి సురేశ్ పెళ్లి ఎలా జరగపోతుంది?

టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేశ్ & ఆంటోనీల వివాహం గోవాలో ఈనెల 12న జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు వివాహం జరగనుండగా, 10న ప్రీవెడ్డింగ్, 11న సంగీత్ నిర్వహించనున్నారు. 12న ఉదయం కీర్తి మెడలో ఆంటోనీ తాళి కట్టనుండగా అదేరోజు సాయంత్రం స్థానిక చర్చిలో మరోసారి వెడ్డింగ్ జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు.

ఇదే విషయంపై కీర్తి సురేష్ తిరుమల తిరుపతిలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.