కరన్ జోహార్ పై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి ఆమె చేస్తున్న కామెంట్స్ కరణ్ జోహార్ ని తీవ్ర ఇబ్బందులోకీ నెట్టేస్తున్నాయి. ఇండస్ట్రీలో అతని లాంటి వాళ్ల వల్లే కొంతమందికి అవకాశాలు రావడం లేదని ఒకసారి సుశాంత్ డేట్స్ తీసుకొని కూడా వేరే సినిమాలు చేయనివ్వకుండా చేశాడని కామెంట్స్ చేసింది.
అదే విధంగా ఒక స్టార్ హీరో వల్ల తను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపిన కంగనా అతని వల్ల పెళ్లి మీద ఆశలు కూడా చచ్చిపోయాయని, తనపై తప్పుడు ప్రచారాలు చేసి అనేక అపనిందలు మోపాడని మాట్లాడింది. అదే విధంగా ఒకానొక సమయంలో గుండు కొట్టించుకొని ఎక్కడికైనా దూరంగా వెల్లిపోయి అదృశ్యమవ్వాలని కూడా అనిపించిందని కంగనా తన భాధను ఇంటర్వ్యూలో బయటపెట్టింది.