హనీ ట్రాప్ అనే రుగ్మత వాళ్ళ సర్వం కోలుపోతున్నారు. చాలా మంది పొలిటిషన్స్, డాక్టర్స్, వ్యాపారవేత్తలు ఇంకా మరి ఎందరో వి ఐ పి వ్యక్తులు ఈ హనీ ట్రాప్ లో పడి వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలు మనం ప్రతిరోజూ పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. మరి ఇలాంటి హనీ ట్రాప్ లో పడకుండా నేటి యువతను చైతన్యవంతుల్ని చేయాలి అని ఈ సినిమా ని నిర్మించాము అని చిత్ర నిర్మాత వి వి వామన రావు గారు తెలియజేశారు.
రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది.
ఈ సందర్భంగా నటుడు, రచయిత, నిర్మాత వి వి వామన రావు మాట్లాడుతూ “1979 నుంచి రచయిత గా చాలా నాటకాలు రాసాను. నా కథ కి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత సీరియల్స్ రాసాను, నిర్మించాను. కథలు చాలా రాసాను, 8 ఏళ్ళ క్రితం ఒక పాకిస్తాన్ అమ్మాయి భారతదేశం నేవీ ఆఫీసర్ ని ట్రాప్ చేసి మన దేశం రహస్య సమాచారాన్ని దోచుకుంది. అప్పుడు పుట్టిన కథ ఇది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ హనీ ట్రాప్ లాంటి చాలా వార్తలు పత్రికల్లో చదివాను. ఇది మంచి సమయం అని ఈ కథ ని సినిమా గా చిత్రరించాము.
సునీల్ కుమార్ రెడ్డి గారు గతం లో రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి సినిమాలు నిర్మించి కమర్షియల్ సక్సెస్ సాధించారు. అయితే నా కథ కి సునీల్ కుమార్ రెడ్డి గారు బాగా సరిపోతారు అని తనతో ప్రయాణం మొదలు పెట్టాను. నేను ఊహించుకున్న కథ కన్నా సునీల్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నా తర్వాత సినిమా కూడా సునీల్ గారితోనే.
నేను చాలా నాటకాల్లో సీరియల్స్ లో నటించాను. ఈ చిత్రం లో కూడా నటించే అవకాశం వచ్చింది. ఒక పొలిటికల్ మినిస్టర్ కి పి ఎ గా నటించాను. మంచి క్యారెక్టర్ వచ్చింది.మా చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది . సమకాలీన అంశాలతో మా చిత్రాన్ని నిర్మించాము. ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది.
మా సినిమా సెన్సార్ కి వెళ్ళినప్పుడు నేను చాలా సన్నివేశాలను కట్ చేస్తారు అని అనుకున్న కానీ సెన్సార్ వాళ్ళు ఎటువంటి కటింగ్ లేకుండా మాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సీన్ లు కట్ చేస్తే సినిమా పట్టు పోతుంది. అందుకే ఎటువంటి కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ ఇస్తున్నాము అని చెప్పారు.
ఈ కరోనా లాక్ డౌన్ లో నిర్మాతకి ఇబ్బంది గానే ఉంది. తెలంగాణ లో అని అనుకూలంగానే ఉన్నాయి కానీ ఆంధ్రాలో 3 షోలకు మాత్రమే అనుమతి ఉంది. మా చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని తెలియజేస్తున్నారు.