బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మరణం సంచలనం రేపిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద పెద్ద వాళ్లు చిన్నవారికి సినిమా ఛాన్సులు రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు బాగా వినిపించాయి. హీరోలు, హీరోయిన్ల కూడా బాలీవుడ్లో నెపోటిజం ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో పాటు సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ కేసు తెరపైకి రావడం, నటులు అరెస్ట్ కావడం కలకలం రేపింది.
ఇప్పుడు ఈ యాదార్థ సంఘటనల ఆధారంగా ఒక సినిమా తీయనున్నట్లు భారత సంతతికి చెందిన హాలీవుడ్ నిర్మాత, నటుడు కె.గణేషణ్ ప్రకటించడం సంచలనంగా మారింది. బాలీవుడ్‌లోని నెపోటిజం, డ్రగ్స్‌పై ఈ సినిమా ఉంటుందని, బాలీవుడ్‌లోని చీకటి నిజాలను బయటపెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ మరణం నుంచి రేఖా చక్రవర్తి అరెస్ట్ అవ్వడం వరకు జరిగిన పరిణామాలను సినిమాలో చూపిస్తామన్నారు.
డ్రగ్స్ కేసులో సంబంధం లేని కొంతమంది వ్యక్తులను ఇరికించారని, దీనిపై డ్రగ్స్ కేసును విచారిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన ఒక యంగ్ అధికారితో మాట్లాడనని చెప్పారు. ప్రస్తుతం స్క్రీఫ్ట్ పనులు జరుగుతున్నాయని, డైరెక్టర్ ఎవరనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ సినిమాకు న్యాయం చేసే దర్శకుడి కోసం వెతుకుతున్నామని తెలిపారు.