ఇటీవల విడుదలైన ‘రం రం ఈశ్వరం’ పాట లిరికల్ వీడియోకి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనూహ్య స్పందన లభించడంతో చిత్ర నిర్మాత మహేశ్వర రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ట్రైలర్ లంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా హీరో విశ్వక్ సేన్, దర్శకుడు అనిల్ రవిపుడి, సంగీత దర్శకుడు తమన్ హాజరవ్వగా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ వాళ్ళు ప్రశంసలు కురిపించారు.
ట్రైలర్ చూస్తే ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలని ఎలివేట్ చేయగా శివేంద్ర విజువల్స్ మరికొన్ని చోట్ల హైలైట్ అయ్యాయి. హీరో అశ్విన్ నటనలో విశ్వరూపం చూపించేలా ఉన్నారు.
అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అశ్విన్ సరసన, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటించారు. అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “మా “శివం భజే” ట్రైలర్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో విశ్వక్ సేన్ గారికి, దర్శకుడు అనిల్ రవిపుడి గారికి, సంగీత దర్శకుడు తమన్ గారికి ధన్యవాదాలు. విడుదలైన కాసేపటికే విజువల్స్, సంగీతం, నిర్మాణ విలువల గురించి ప్రశంసలు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన మా మొదటి పాట ”రం రం ఈశ్వరం” కి వైపుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస నేపథ్య గీతం, పాటలు ఈ చిత్రానికి చాలా బలమయ్యాయి. హీరో అశ్విన్ బాబు గారు నటనలో విశ్వరూపం చూపించారు. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరథి విజువల్స్ ఇండస్ట్రీ అగ్ర నిపుణులు, ఉన్నతమైన సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి చిత్రం ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించాం. దర్శకుడు అప్సర్ వినూత్న కథ, కథనాలు అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్ర విజయంపై మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఆ మహేశ్వరుడి దీవెనలు, అన్ని వర్గాల ప్రేక్షకుల ఆశీస్సులతో ఆగష్టు 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్