సెలబ్రెటీలు వాడే వస్తువుల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. సెలబ్రెటీలు వాడే వస్తువుల ధరలను నెట్లో సెర్చ్ మరీ తెలుసుకుంటారు అభిమానులు. సెలబ్రెటీలు అంటేనే బ్రాండెడ్ వస్తువులు వాడతారు. దుస్తులు, వ్యాచ్లు, బ్యాగ్‌లు… ఇలా ఏదైనా సరే పాపులర్ బ్రాండెడ్, అత్యధిక ధర గల వాటిని ఉపయోగిస్తారు. అందుకే సెలబ్రెటీలు వాడే బ్రాండెడ్ వస్తువులు, వాటి ధర గురించి అభిమానులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు.
తాజాగా హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ హినా ఖాన్ హ్యాండ్ బ్యాగ్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది ఇటీవల గూచీ బ్యాగ్ బ్రాండ్‌తో ఈ బ్యూటీ కనిపించింది. ఓఫిడా సాఫ్ట్ జిజి సుప్రీం మీడియం టోట్ బ్యాగ్ ఇది. దీని ధర రూ.2 లక్షలు ఉంటుంది. టీవీ సర్కిల్స్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటి హీనా ఖాన్. అలాంటి ఈ బ్యూటీ ఇంత ఖరీదు హ్యాండ్ బ్యాగ్ వాడటంలో తప్పు లేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.