ఆన్‌లైన్ సర్వే: ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ సినిమా ఇదే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో మల్టీ టాలెంటెండ్ హీరో అంటే ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే యాక్టింగ్‌తో పాటు మంచి డ్యాన్సర్, బెస్ట్ డైలాగ్ డెలివరీ, బెస్ట్ సింగర్‌గా ఎన్టీఆర్‌కు పేరుంది. ఎంద పెద్ద డైలాగ్ అయినా.. ఎన్టీఆర్‌లా సింగిల్ టేక్‌లో ఎవరూ చెప్పలేరనేది మనందరికీ తెలిసిన విషయమే.

NTR CARRER SIMHADRI

తాజాగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా ఏంటీ? అనే దానిపై ఒక సంస్థ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సింహాద్రి సినిమాకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. యమదొంగ సినిమాకు 3.18 శాతం మంది ఓటేయ్యగా..ఆది సినిమాకు 15.65 శాతం మంది ఓటేశారు. ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు 3.05 శాతం మంది, టెంపర్ సినిమాకు 14.79 శాతం మంది ఓటేశారు. ఇక సింహాద్రి సినిమాకు అత్యధికంగా 33.25 శాతం మంది ఓటేశారు.