స్టార్ హీరో సూర్యకు కరోనా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని హీరో సూర్య స్వయంగా వెల్లడించాడు. మనమంతా సాధారణ స్థితికి వచ్చేశామని అనుకోవద్దని, ఇంకా కరోనా తీవ్రత ఉందన్నాడు. దేనికి భయపడనక్కర్లేదని, కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూర్య తన అభిమానులకు చెప్పాడు. హీరో సూర్యకు కరోనా సోకడంతో… గత కొద్దిరోజుల్లో ఆయనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.

surys tests corona positive

ఇటీవల వచ్చిన ఆకాశమే నీ హుద్దురా సినిమాతో సూర్య సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ నామినేషన్‌కి వెళ్లింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం పలు సినిమాల్లో సూర్య నటిస్తున్నాడు.