సినీ ఇండస్ట్రీలో సంచలనం: ఒకే సినిమాలో 140 మంది స్టార్స్

ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అనేవి ఒక ట్రెండ్‌గా మారిపోయాయి. ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం కామన్‌గా మారిపోయింది. ప్రేక్షకులు కూడా ఇలాంటి మల్టీస్టారర్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 140 మంది స్టార్స్ ఒక సినిమాలో నటించనున్నారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ అద్భుతం జరగబోతోంది.

140 starts one movie

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మలయాళ సినీ పరిశ్రమకు చెందని 140 మంది స్టార్స్ నటించనున్నారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాకి రాజీవ్ కమార్ దర్శకత్వం వహించనున్నాడు. కోవిడ్ వల్ల సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులను సినీ కార్మికులకు అందజేయనున్నారు.