యూత్ కి ఫిట్నెస్ గోల్స్ ఇస్తున్న సందీప్ కిషన్

నిను వీడని నీడని నేనే సినిమాతో కంబ్యాక్ హిట్ ఇచ్చిన సందీప్ కిషన్, ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా A1 సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ హాకీ బేస్డ్ మూవీపై టాలీవుడ్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు సెట్స్ పై ఉండగానే హిట్ అవుతుందనే నమ్మకం కలిగిస్తాయి కదా, A1 ఎక్స్ప్రెస్ కూడా అదే ఫీలింగ్ కలిగిస్తోంది. పోస్టర్స్ నుంచి సింగిల్ కింగులం సాంగ్ వరకూ A1 ఎక్స్ప్రెస్ ప్రమోషనల్ కంటెంట్ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాయి.

ఆల్ చార్డ్స్ ని పర్ఫెక్ట్ గా హిట్ చేస్తూ A1 ఎక్స్ప్రెస్ ని జనాల్లోకి తీసుకెళ్తున్న సందీప్ కిషన్, కొత్త మేకోవర్ కనిపిస్తూ ఫుల్ ఫిట్ అయ్యాడు. కర్లీ హెయిర్ తో, సిక్స్ ప్యాక్ బాడీతో సందీప్ కిషన్ ముందెన్నడూ లేనంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే సందీప్ కిషన్ చేస్తుంది స్పోర్ట్స్ డ్రామా అయినా పర్ఫెక్ట్ మాస్ హీరో రేంజులో ఉన్నాడు.