అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది.. ‘భాగ్ సాలే’పై హీరో శ్రీసింహా

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో హీరో శ్రీసింహా మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

మేం ఏదో సందేశాన్ని ఇవ్వాలని ఈ సినిమాను చేయలేదు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలని చేశాం. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు వేశాం. వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుని బయటకు వచ్చారు. మేం అనుకున్నదే జరిగింది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది.

నాకు ఈ మూవీ కథను ఎప్పుడో చెప్పాడు. కానీ నాకున్న కమిట్మెంట్‌ల వల్లే ఆలస్యం అయింది. తెల్లవారితే గురువారం, ఉస్తాద్, దొంగలున్నారు జాగ్రత్త వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది. ఉస్తాద్ కూడా కరోనా టైంలో విన్న కథే. ఇప్పుడు ఈ రెండూ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్ల లాభాలు, నష్టాలుంటాయి. బ్యాగేజ్‌లా ఉంటుంది. కాస్త ఎక్స్‌పోజర్ కూడా ఉంటుంది.

నెరేషన్ వినేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నానా? లేదా? అన్నదే చూస్తాను తప్పా.. ఏ జానర్, ఏ కాన్సెప్ట్ అన్నది పట్టించుకోను.

నేను మా అన్నతో కలిసి పని చేయాలని అనుకోలేదు. నా సినిమా దర్శకులే కాళ భైరవను ఎంచుకుంటారు. ఈ మూవీకి ఫస్ట్ సెలెక్ట్ అయింది కాళ భైరవ అన్ననే. తరువాతే నేను సెలెక్ట్ అయ్యాను. నాకు స్క్రిప్ట్ విషయంలో డౌట్ వస్తే రాజమౌళి గారి సలహాలు తీసుకుంటాను.

మా డైరెక్టర్ ప్రణీత్ ఎప్పుడూ బెటర్మెంట్ కోసం ట్రై చేస్తుంటాడు. సెట్స్‌కు వెళ్లే ముందే పదిహేను వర్షెన్స్ రాసుకున్నారు. ప్రతీ సీన్, ప్రతీ కారెక్టర్‌లో బెటర్మెంట్ చూస్తుంటాడు. అదే ఆయన బలం.

దొంగలున్నారు జాగ్రత్త కొంత మందికి నచ్చింది.. కొంత మందికి నచ్చలేదు. నాకు దర్శకులు చెప్పింది చెప్పినట్టు తీశారు. ఒక సినిమా ఎందుకు ఆడుతుంది.. ఎందుకు ఆడలేదు అనేది చెప్పలేం. హై బడ్జెట్ పెట్టిన సినిమాలన్నీ ఆడుతాయ్ అని కూడా కాదు. ఓ చిత్రం ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

రాజమౌళి గారితో సినిమా చేయాలని అందరికీ ఓ కల ఉంటుంది. కానీ చనువు ఉంది కదా? అని ఛాన్స్ అడగలేను. ముందు నేను చాలా నేర్చుకోవాలి. ఆ తరువాత ఆయనకు ఓకే అనుకుంటే తీసుకుంటారు.

నా సినిమాల్లో కామెడీ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో హీరో పాత్రలోనే కామెడీ ఉంటుంది. కామికల్‌గా కారెక్టర్ ఉంటుంది. అన్ని జానర్లలో సినిమాలు చేయాలని ఉంది. క్రైమ్ కామెడీ జానర్‌లో తీసినా కూడా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాం.

రంగస్థలం సినిమాకు ఏడీగా పని చేయడం వల్ల ఎంతో అనుభవం వచ్చింది. నా యాక్టింగ్‌లో ఆ అనుభవం ఉపయోగపడింది.

సహజంగా ఉండాలనే జనాల మధ్యలో సినిమాను తీశాం. దాని వల్ల చాలా సమస్యలు వచ్చాయి. జనాలు షూటింగ్ మధ్యలో కెమెరాల వైపు చూస్తుండేవారు. దాంతో చాలా టేక్స్ తీసుకున్నాం. కానీ ఎంతో నేచురల్‌గా వచ్చింది.

కాలేజ్ స్టూడెంట్స్‌కు షోలు వేసి చూపించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్లకు కూడా చూపించాం. సినిమా బాగుందని చెప్పారు. దాంతో మాకు ఇంకా నమ్మకం పెరిగింది.

నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే నేను చేస్తాను. భాగ్ సాలే కథను మా ఇంట్లో ఎవ్వరూ వినలేదు. ఇంట్లో వాళ్లు టీజర్, ట్రైలర్ చూసి బాగుందని అన్నారు. అలా నాకు ఈ సినిమాతో మరింతగా నమ్మకం పెరిగింది.

టీజర్, ట్రైలర్ నచ్చితే సినిమాల మీద జనాలకు ఆసక్తి కలుగుతుంది.  ఇంత వరకు నా ఏ సినిమాకు రాని బజ్ ఈ భాగ్ సాలేకు వచ్చింది. తెలంగాణ, కేసీఆర్ డైలాగ్ బాగా క్లిక్ అయింది. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల సినిమా బాగా ఆడుతోంది.

కాళ భైరవ అందించిన ఆర్ఆర్ వల్ల సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఈ సినిమాకు సంగీతమే మెయిన్ పిల్లర్.

నేను కొత్త దర్శకులతోనే పని చేస్తున్నాను. కానీ పెద్ద నిర్మాణ సంస్థల్లో చేశాను. వాళ్లకి మా కథ మీద, మా మీద నమ్మకం ఉంటుంది. ముందు డెమో చేయమని నా డైరెక్టర్లకు చెప్పేవారు. అవి నిర్మాతలకు నచ్చేవి. అలా నా డైరెక్టర్లకు చాన్స్ ఇచ్చేవారు.

మా నిర్మాతలకు భాగ్ సాలే సినిమా, కథ పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. వాళ్లు మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు