BREAKING: రాంచరణ్‌కు కరోనా నెగిటివ్

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్‌కు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాంచరణ్ స్వయంగా ట్వీట్ చేశాడు. కరోనా నెగిటివ్ వచ్చిందనే విషయాన్ని పంచుకునేందుకు ఆనందంగా ఉందని, ఆలస్యంగా చేయకుండా త్వరలో పనిలోకి దిగుతానన్నాడు. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అంటూ రాంచరణ్ ఒక ప్రకటన విడుదల చేశాడు.

RAM CHARAN CORONA NEGATIVE

కాగా గత కొద్దిరోజుల క్రితం రాంచరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడు హోం క్వారంటైన్‌లో ఉంటూ కరోనా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా టెస్టు చేయించుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. కొద్దిరోజులకే అతడు కోలుకున్నాడు.