హిందూపూర్ టిడిపి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా హీరో నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ గారు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు రాజకీయాలలో ఉత్సాహంగా ఉంటారు. తన తండ్రి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరపున ఇప్పటికే రెండు సార్లు హిందూపూర్ నియజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నందమూరి బాల కృష్ణ గారు మరోసారి హిందూపూర్ నుండి పోటీ చేయనున్నారు. దానికి గాను ఈరోజు హిందూపూర్ ప్రభుత్వ కలెక్టరేట్ ఆఫీసులో నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 13న అనే విషయం అందరికి తెలిసిందే.