‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ చిత్రంలోని ‘హలో అమ్మాయి’ పాట మనసులను దోచేసేలా ఉంది

తన కామెడి సీన్స్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాడు అభినవ్ గోమటం. తనకంటూ కామెడి పరంగా ఒక యునిక్ బేస్ ని ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా క్రియేట్ చేసుకున్నాడు, ఆ తరువాత మీకు మాత్రం చెప్తాను సినిమాలో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు, OTT లో రిలీజ్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కూడా తన సత్తాను చాటుకున్నాడు.. ప్రస్తుతం మస్తు షేర్స్ ఉన్నాయ్ రా అనే రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నాడు, ఈ చిత్రంలోని మొదటి పాట ఈరోజు రిలీజ్ అయింది..

హలో అమ్మాయి అనే ఈ పాటలో మెలడీతో పాటు సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ రాశారు.. టి సంజీవ్ అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు, సిద్ శ్రీరామ్ గానంతో ఈ పాటకే అందం వచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రం మొత్తం హీరో తన ప్రేయసి చుట్టు తిరుగుతూ తన ప్రేమ తాలూకా భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు, హీరోయిన్ పాత్రలో వైశాలి రాజ్ నటించారు, ఈ సాంగ్లో అభినవ గోమటం వైశాలి రాజ్ ఇద్దరు ఫీల్ గుడ్ రొమాన్స్ ని పండించారు..

కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ చిత్రాన్ని తిరుపతిరావు డైరెక్షన్ చేయగా భవాని కాసుల, అరీం రెడ్డి అండ్ ప్రశాంతి వి ప్రొడ్యూస్ చేశారు.. పులిమేర 2 చిత్రం ద్వారా వంశీ నందిపాటికి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు వచ్చింది, ఈ వంశీ నందిపాటి ఈ మస్తు షేడ్స్ ఉన్నాయి రా చిత్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 23న రిలీజ్ చేయబోతున్నారు..

తారాగణం:
అభినవ్ గోమటం, వైశాలి రాజ్, అలీ రాజా, మోయిన్, నిజాల్ గల్ రవి, ఆనంద్ చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ మరియు ఫణి చంద్రశేఖర్

సాంకేతిక నిపుణులు:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం – తిరుపతిరావు
నిర్మాతలు – అరీమ్ రెడ్డి, ప్రశాంత్ వి, భవాని కాసుల
రచయిత – అన్వర్ సాదిక్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – సిద్ధార్థ్ స్వయంభు
మ్యూజిక్ డైరెక్టర్ – సంజీవ్ టీ
ఎడిటర్ – రవితేజ గిరిజాల