కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్‌కు భారీ డిమాండ్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్-2 సినిమాపై భారీ అంచాలు నెలకొన్నాయి. గత కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా టీజర్‌గా నిలిచింది. హెంబలే ఫిలిమ్స్ బ్యానన్‌పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించగా.. సమ్మర్‌లో విడుదల చేసే అవకాశముంది.

KGF2 TELUGU RIGHTS

కేజీఎఫ్ చాఫ్టర్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ కావడంతో.. కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. తెలుగు రైట్స్ మొత్తం కలిపి మేకర్స్ రూ.75 కోట్లు చెబుతున్నారని తెలుస్తోంది. కేజీఎఫ్ 1 తెలుగులో రూ.15 కోట్ల బిజినెస్ అయిందట. కానీ కేజీఎఫ్ 2కు మరింత క్రేజ్ ఉండటంతో.. రూ.30 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశముంది.